Page Loader
BCCI Prize Money: టీమిండియాకు రూ.125కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ 
BCCI Prize Money: టీమిండియాకు రూ.125కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ

BCCI Prize Money: టీమిండియాకు రూ.125కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ 

వ్రాసిన వారు Stalin
Jun 30, 2024
11:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

BCCI Prize Money: రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు టీ20 ప్రపంచ కప్‌(T20 World Cup)ను గెలుచుకుంది. ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానాను ప్రకటించింది. జట్టు మొత్తానికి రూ. ప్రైజ్ మనీగా రూ.125కోట్లు ఇస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్‌ చేశారు. బీసీసీఐ సెక్రటరీ జయ్ షా ట్వీట్‌లో ఇలా రాశారు. 'ఐసీసీ పురుషుల టి 20 ప్రపంచ కప్‌ను గెలిచిన భారత జట్టుకు ప్రైజ్ మనీగా రూ. 125 కోట్లు ఇవ్వనున్నట్లు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుతమైన ఆటతీరు, ప్రతిభ, సంకల్పం, క్రీడాస్ఫూర్తి ప్రదర్శించింది' అని పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జై షా ట్వీట్