Page Loader
'అత్యంత ఖరీదైన అటగాళ్లలో బెన్ స్ట్రోక్స్ ఒకరు': మోర్గాన్
ఇయాన్ మోర్గాన్

'అత్యంత ఖరీదైన అటగాళ్లలో బెన్ స్ట్రోక్స్ ఒకరు': మోర్గాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 23, 2022
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

2023 వేలంలో అత్యంత ఖరీదైన అటగాళ్లలో బెన్ స్టోక్స్ ఒకరని ఇంగ్లాడ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపారు. ఇంగ్లాడ్ టెస్ట్ కెప్టెన్ మెరుగైన ప్రదర్శన చేశారన్నారు. మ్యాచ్ ప్రభావం మార్చగల సత్తా బెన్ స్టోక్స్ ఉందన్నారు. జియో సినిమాలో ఐపిఎల్ 2023కి ముందు జరిగిన వేలం ప్రదర్శనలో ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ పంజాబ్ కింగ్స్ జట్టు బెన్ స్టోక్స్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. 2018లో రాజస్థాన్ రాయల్స్ రూ. 12.5 కోట్లకు కొనుగోలు చేసిందని ఇప్పుడు కూడా అంతే మొత్తంలోనే బెన్ స్ట్రోక్స్ అమ్ముడుపోతారని తెలిపారు. వేలంలోకి వెళ్లడానికి పంజాబ్ కింగ్స్ వద్ద రూ.32.2 కోట్లు, సన్ రైజర్స్ వద్ద 42.25 కోట్లు ఉన్నాయి.

ఇయాన్ మోర్గాన్

'అద్భుతమైన నాయకుడిగా జట్టును నడిపిస్తాడు' : మోర్గాన్

టెస్ట్ కెప్టెన్ గా బెన్ స్ట్రోక్స్ అధ్బుత ప్రదర్శన చూపారు. ఒత్తిడిలో తన అనుభవాన్ని చాటాడు.పంజాబ్ కింగ్స్ బెన్ స్ట్రోక్స్‌ను కొనుగోలు చేయడానికి ముందుండాలి. అద్భుతమైన నాయకుడిగా కూడా జట్టును నడిపించగలడు. PBKS తమ కెప్టెన్‌గా శిఖర్ ధావన్‌ని నియమించింది, అయితే జట్టులో నాయకుడిగా ఉండటానికి స్టోక్స్‌కు కెప్టెన్ బ్యాండ్ అవసరం లేదని చెప్పాడు. "ఖచ్చితంగా, ప్రతి పైసాకి న్యాయం చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తారని చెప్పారు. టీ20 ఫార్మెట్లో స్ట్రోక్స్ కీలకమైన వ్యక్తి. 2017లో ఐపీఎల్‌లోకి స్ట్రోక్స్ అరంగ్రేట్రం చేశారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 43 మ్యాచ్‌లు ఆడి రెండు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలతో సహా 920 పరుగులు చేశాడు. అయితే ఐదు సీజన్లలో స్టోక్స్ 28 వికెట్లు పడగొట్టాడు.