Page Loader
IPL 2025: దిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్‌కు హ్యారీ బ్రూక్ గుడ్‌బై చెప్పినట్టేనా?
దిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్‌కు హ్యారీ బ్రూక్ గుడ్‌బై చెప్పినట్టేనా?

IPL 2025: దిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్‌కు హ్యారీ బ్రూక్ గుడ్‌బై చెప్పినట్టేనా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 10, 2025
01:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సమరం ముగిసింది. ఇక మరో 12 రోజుల్లో మరో మెగా లీగ్ ప్రారంభం కానుంది. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025). మార్చి 22 నుంచి ఐపీఎల్ ఉత్సవం మొదలవనుంది. ఈ నేపథ్యంలో దిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాడు హ్యారీ బ్రూక్‌ ఇప్పుడు నిషేధం ఎదుర్కొనే అవకాశముంది. 18వ ఎడిషన్‌లో ఆడనని హ్యారీ బ్రూక్ స్వయంగా వెల్లడించినట్లు సమాచారం. ఇంగ్లాండ్ క్రికెట్‌ బోర్డు కూడా ఈ విషయాన్ని బీసీసీఐకి తెలియజేసినట్లు తెలుస్తోంది.

Details

హ్యారీ బ్రూక్‌పై నిషేధం విధించే అవకాశాలు

గత ఐపీఎల్ వేలంలో దిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే వేలంలో ఓ ఫ్రాంచైజీతో కాంట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఆడకపోతే, సంబంధిత జట్టు నిషేధం విధించే హక్కు కలిగి ఉంటుంది. దీంతో హ్యారీ బ్రూక్‌పై నిషేధం విధించే అవకాశముందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి