
Rishabh Pant: భారత్‌కు బిగ్ షాక్.. గాయంతో ఐదో టెస్టు నుంచి రిషబ్ పంత్ ఔట్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) ఐదో టెస్టు నుంచి తప్పుకున్నాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో గాయపడిన అతడికి కుడికాలులో ఫ్యాక్చర్ రావడంతో చివరి టెస్టుకు అందుబాటులో ఉండడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. పంత్ స్థానంలో తమిళనాడు వికెట్ కీపర్-బ్యాటర్ నరన్ జగదీశన్‌కు చోటు కల్పించారు. మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ సమయంలో క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించిన రిషభ్‌కు బంతి నేరుగా కాలుకు తగిలింది. దాంతో మైదానంలోనే అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడాడు. 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయిన పంత్, తర్వాతి రోజు మళ్లీ క్రీజులోకి వచ్చి గాయం ఉన్నప్పటికీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి అర్ధశతకం (54) సాధించాడు.
Details
యోధుడిలా పంత్ పోరాడాడు
అయితే గాయతీవ్రమై ఉండటంతో కీపింగ్ చేయలేకపోయాడు. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ల వెనుక భాద్యతలు నిర్వహించాడు. రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ బరిలోకి దిగకుండా బయటే ఉన్నాడు. పంత్ గాయంపై బీసీసీఐ స్పందిస్తూ అతడు టెస్టు నుంచి తప్పుకున్నట్లు స్పష్టం చేసింది. బీసీసీఐ మెడికల్ టీమ్ పంత్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, అతడు త్వరగా కోలుకొని మళ్లీ జట్టులోకి రావాలని ఆశిస్తున్నామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. ఇక పంత్ గాయంపై భారత కోచ్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ - ''అతడు కాలికి గాయమైనా బ్యాటింగ్ చేశాడు. నిజంగా ఓ యోధుడిలా ఆడాడు. రాబోయే తరాలు ఈ ఇన్నింగ్స్ గురించి చెప్పుకుంటుంటాయి. ఇటువంటి సమయంలో గాయపడడం చాలా దురదృష్టకరం.
Details
సెంచరీలతో చెలరేగిన రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్
అతడు తిరిగి జట్టులోకి రావాలని ఆకాంక్షిస్తున్నాను. టెస్టు ఫార్మాట్‌కు పంత్ ఎంతో విలువైన ఆటగాడని ప్రశంసించారు. మరోవైపు మాంచెస్టర్ టెస్టు డ్రాగా ముగిసింది. భారత జట్టును రవీంద్ర జడేజా (107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో కాపాడారు. అంతకుముందు శుభ్‌మన్ గిల్ (103) శతకం సాధించగా, కెఎల్ రాహుల్ (90) తృటిలో సెంచరీని కోల్పోయాడు. ఈ ఫలితంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1తో ముందంజలో ఉంది. నిర్ణయాత్మక ఐదో టెస్టు జూలై 31న లండన్‌లోని ఓవల్ మైదానంలో జరగనుంది. భారత్ సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి.