IPL: ఐపీఎల్‌కు ముందే.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు షాక్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. జట్టు పేసర్ హర్షిత్ రాణా ఈ సీజన్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ సందర్భంగా హర్షిత్ రాణా మోకాలి గాయానికి గురయ్యాడు. ఆ గాయం కారణంగా అతడికి శస్త్రచికిత్స కూడా జరిగింది. అయితే ఆ ఆపరేషన్ తర్వాత ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. అందుకే ఆయన ఈసారి ఐపీఎల్‌లో ఆడే అవకాశాలు తగ్గినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
వివరాలు
ఇతర బౌలర్లకు ఛాన్స్
ఇక హర్షిత్ రాణా జట్టులో లేకపోతే ఇతర బౌలర్లకు అవకాశం దక్కే అవకాశముంది. ముఖ్యంగా వైభవ్, ఉమ్రాన్, కార్తిక్, ఆకాశ్ లాంటి ఆటగాళ్లు జట్టులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయినప్పటికీ రాణా స్థానంలో ఎవరినీ ఇప్పటివరకు రిప్లేస్‌మెంట్‌గా తీసుకోలేదని తెలుస్తోంది.