LOADING...
Rajasthan Royals Injuries:ప్లేఆఫ్స్ ముందు రాజస్థాన్‌కు భారీ షాక్.. జడేజా, రియాన్ పరాగ్ ఫిట్‌నెస్‌పై ఆందోళన!
ప్లేఆఫ్స్ ముందు రాజస్థాన్‌కు భారీ షాక్.. జడేజా, రియాన్ పరాగ్ ఫిట్‌నెస్‌పై ఆందోళన!

Rajasthan Royals Injuries:ప్లేఆఫ్స్ ముందు రాజస్థాన్‌కు భారీ షాక్.. జడేజా, రియాన్ పరాగ్ ఫిట్‌నెస్‌పై ఆందోళన!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 25, 2026
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ఆనందంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు ఇప్పుడు స్టార్ ఆటగాళ్ల ఫిట్‌నెస్ పెద్ద ఆందోళనగా మారింది. ముఖ్యంగా భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయాలతో ఇబ్బంది పడుతుండగా, జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌లో లేనట్లు వెల్లడించడంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ విజయంలో జడేజా కీలక పాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ చివర్లో కేవలం 11 బంతుల్లో 19 పరుగులు చేసి జట్టుకు మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. అయితే ఇటీవల అతడు మోకాలి గాయం, మోచేతి సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం.

వివరాలు

డేజా ఫిట్‌నెస్‌పై స్పందించిన సంగర్కర

ఇదే కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌లతో జరిగిన వరుస మ్యాచ్‌లకు జడేజా దూరమయ్యాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కూడా అతడిని పూర్తి స్థాయిలో వినియోగించకుండా కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే బరిలోకి దింపారు. మ్యాచ్ అనంతరం రాజస్థాన్ హెడ్ కోచ్ కుమార్ సంగర్కర జడేజా ఫిట్‌నెస్‌పై స్పందించాడు. "జడేజా గాయంతో బాధపడుతున్నాడు. అతడిని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాం. ఎక్కువసేపు బ్యాటింగ్ చేయడం వల్ల అతడిపై ఒత్తిడి పెరుగుతోంది. ఇంకో రెండు రోజుల విశ్రాంతి దొరికితే అతడిని మరింత మెరుగ్గా వినియోగించగలుగుతామని సంగక్కర వెల్లడించాడు.

వివరాలు

జడేజా మోకాలికి స్వల్ప గాయం

మరోవైపు కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా తాను పూర్తిగా ఫిట్‌గా లేనని స్పష్టం చేశాడు. "నేను పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌లో లేను. మానసిక ధైర్యంతోనే ఆడుతున్నాను. నిజానికి ఈ మ్యాచ్‌లో కూడా ఆడకూడదని అనుకున్నాం. అయినా జట్టు కోసం బరిలోకి దిగానని మ్యాచ్ అనంతరం తెలిపాడు. ప్లేఆఫ్స్‌లో ఆడతారా అనే ప్రశ్నకు స్పందిస్తూ "ఖచ్చితంగా ఆడతాను" అని పరాగ్ ధీమా వ్యక్తం చేశాడు. అలాగే జడేజా గురించి మాట్లాడుతూ.. "జడ్డూ భాయ్‌కు చిన్నచిన్న గాయాలు ఉన్నాయి. కానీ అతడు యోధుడు. తిరిగి బలంగా వస్తాడని అన్నాడు. ఇక రాజస్థాన్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ కూడా గతంలో జడేజా మోకాలికి స్వల్ప గాయం ఉందని వెల్లడించాడు.

Advertisement

వివరాలు

మే 27న న్యూ చండీగఢ్ వేదికగా మ్యాచ్

"అతడి మోకాలిలో కొంత సమస్య ఉంది. అందుకే ఒక మ్యాచ్ అదనంగా విశ్రాంతి ఇవ్వాలని భావించామని మే 17న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ అనంతరం చెప్పాడు. దీంతో ప్లేఆఫ్స్‌కు ముందు జడేజా, రియాన్ పరాగ్ ఫిట్‌నెస్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఇద్దరూ పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధిస్తే జట్టుకు మరింత బలం చేకూరే అవకాశం ఉంది. ఇక ప్లేఆఫ్స్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ మే 27న న్యూ చండీగఢ్ వేదికగా జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.

Advertisement