RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. గాయం కారణంగా డబ్ల్యూపీఎల్‌కు పూజా వస్త్రాకర్ దూరం
ఈ వార్తాకథనం ఏంటి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు కీలకమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ గాయంతో డబ్ల్యూపీఎల్ (WPL) నుంచి తాత్కాలికంగా తప్పుకుంది. ఆమెకు గాయ సమస్య తలెత్తడంతో దాదాపు రెండు వారాల పాటు టోర్నీకి దూరంగా ఉండాల్సి ఉంటుందని హెడ్‌కోచ్ రంగరాజన్ స్పష్టం చేశారు. పూజా వస్త్రాకర్ చివరిసారిగా 2024 అక్టోబర్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో మైదానంలో కనిపించింది. గతేడాది నవంబర్‌లో జరిగిన డబ్ల్యూపీఎల్ వేలంలో ఆర్సీబీ ఆమెను రూ.85 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే ఆమెకు గాయ సమస్యలు ఎదురయ్యాయి.
Details
కనీసం రెండు వారాలు సమయం పట్టే అవకాశం
ఈ విషయంపై కోచ్ రంగరాజన్ మాట్లాడుతూ.. ''పూజా ప్రస్తుతం జట్టుకు అందుబాటులో లేదు. మొదట ఆమె భుజానికి గాయమవడంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స తీసుకుంది. ఆమెకు తొడ కండరాల గాయం కూడా తలెత్తింది. ఈ కారణంగా ఆమె మళ్లీ మైదానంలోకి రావడానికి కనీసం మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉందని తెలిపారు. పూజా గైర్హాజరీలో ఆర్సీబీ బౌలింగ్ విభాగాన్ని ఇంగ్లాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లిన్సే స్మిత్, అరుధంతి రెడ్డి, నదైన్ డి క్లర్క్ భుజాన వేసుకున్నారు. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు ప్రత్యర్థిని 154 పరుగులకే పరిమితం చేశారు. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ తరుపున నదైన్ డి క్లర్క్ (63*)రాణించడంతో ఆ జట్టు గెలుపొందింది.