Page Loader
IND vs AUS: ఇండోర్ టెస్ట్‌లో రోహిత్ శర్మకు ఘోర అవమానం!
రోహిత్ శర్మపై అభిమానుల హాట్ కామెంట్స్

IND vs AUS: ఇండోర్ టెస్ట్‌లో రోహిత్ శర్మకు ఘోర అవమానం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 04, 2023
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఘోర అవమానం జరిగింది. సొంత అభిమానులే రోహిత్ శర్మపై నోరు పారేసుకున్నారు. మూడో టెస్టులో ఓడిపోవడాన్ని తట్టుకోలేకపోయిన అభిమానులు వడాపావ్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఈ వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డవ్వడంతో వైరల్‌గా మారింది. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అవమానించడాన్ని క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడో టెస్టులో రోహిత్ శర్మ బ్యాటింగ్‌‌తో పాటు కెప్టెన్సీలోనూ విఫలమైన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో కుహ్మేమన్ బౌలింగ్‌లో స్టంపౌటైన రోహిత్, రెండో ఇన్నింగ్స్‌లో నాథన్ లయన్ బౌలింగ్ ఔటయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 12 పరుగులను మాత్రమే రోహిత్ చేశాడు.

రోహిత్ శర్మ

రోహిత్ పై అభిమానుల బాడీ షేమింగ్ కామెంట్స్

ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా, టీమిండియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ రెండో ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లు తీయడంతో టీమిండియా బ్యాట్ మెన్స్ పెవిలియానికి క్యూ కట్టయారు. ఈ ఓటమిని తట్టుకోలేక అభిమానులు రోహిత్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా రోహిత్ శర్మ ఫిట్ నెస్ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. రోహిత్ లావుగా కనిపిస్తున్నాడని ఇటీవల టీమిండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అభిమానులు మరోసారి రోహిత్ శర్మ ఫిటె నెస్ అంశాన్ని తెరపైకి తెచ్చారు.