Page Loader
రోహిత్ మరీ లావుగా కనిపిస్తున్నాడు.. మాజీ లెజెండ్ కామెంట్
రోహిత్ శర్మ ఫిట్‌నెస్ గురించి మాట్లాడిన కపిల్ దేవ్

రోహిత్ మరీ లావుగా కనిపిస్తున్నాడు.. మాజీ లెజెండ్ కామెంట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2023
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

రోహిత్ శర్మ ఫిట్‌నెస్ గురించి ఎన్నో ఏళ్లుగా చర్చ కొనసాగుతూనే ఉంది. రోహిత్ బ్యాటింగ్ విఫలమైన ప్రతిసారీ రోహిత్ ఫిటె‌నెస్‌పై సోషల్ మీడియాలో ట్రోల్ తెగ వైరల్ అవుతుంటాయి. ఏదో ఒక సందర్భంలో రోహిత్ బాడీ షేమింగ్‌పై వార్తలు వస్తుంటాయి. తాజాగా మాజీ లెజెండ్ కపిల్ రోహిత్ ఫిటెనెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ మరీ లావుగా కనిపిస్తున్నాడని, అది కూడా టీవిలో చాలా స్పష్టంగా కనిపిస్తోందని, ఫిట్ నెస్ విషయంలో మరింత కష్టపడాల్సి వస్తుందని కపిల్ దేవ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఫిట్‌గా ఉండటం ఏ క్రీడాకారుడికైనా చాలా ముఖ్యమని, ఈ విషయంలో జట్టు సారథి సభ్యులకు ఆదర్శంగా ఉండాలని కపిల్ అభిప్రాయపడ్డాడు.

రోహిత్

కోహ్లీని చూసి రోహిత్ నేర్చుకోవాలి

ఫిట్ నెస్ విషయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని చూసినేర్చుకోవాలని, కోహ్లీ ఫిట్‌గా ఉంటూ యావత్ క్రీడా ప్రపంచానికే అదర్శరంగా ఉన్నాడని కపిల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా హిట్ మ్యాన్ అభిమానులు ఈ వ్యాఖ్యలను అస్సలు జీర్ణించుకోవడం లేదు. బాడీ షేమింగ్ చేయడం కరెక్ట్ కాదని, కపిల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని రోహిత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి కామెంట్లు చేసే వారి కోసమైనా రోహిత్‌ సన్నబడతాడో లేదో వేచి చూద్దాం