ధోని రికార్డును సమం చేసిన హిట్‌మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే రోహిత్ శర్మ ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఎంఎస్ ధోని రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. రోహిత్ శర్మ గత వారం టెస్టు క్రికెట్‌లో కెప్టెన్‌గా నాలుగో విజయాన్ని అందుకున్నాడు. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. బోర్డర్ ట్రోఫీలో భాగంగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో భారత కెప్టెన్‌గా తన మొదటి నాలుగు టెస్టులను గెలిచిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని రోహిత్ సమం చేశాడు. రోహిత్ తన మొదటి నాలుగు టెస్ట్ మ్యాచ్‌లను గెలిచిన రెండవ భారత క్రికెటర్‌గా నిలిచాడు.
రోహిత్ శర్మ సాధించిన రికార్డులివే
2022లో రోహిత్ శర్మకు టెస్ట్ కెప్టెన్సీ అప్పగించారు. తన తొలి టెస్టు సిరీస్‌ను 2-0తో గెలిపించాడు. జూలైలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదవ, చివరి టెస్టుకు దూరమయ్యాడు. బొటనవేలు గాయం కారణంగా రోహిత్ డిసెంబర్‌లో బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. నాలుగు టెస్టుల్లో రోహిత్ 273 పరుగులు చేశాడు. నాగ్‌పూర్‌లో జరిగిన టెస్టులో తన తొలి టెస్టు శతకాన్ని సాధించాడు. ఓవరాల్‌గా టెస్టులో తొమ్మిది సెంచరీలను చేశాడు. రోహిత్ వరుసగా 29, 15, 46, 120, 32, 31 పరుగులు చేశాడు. 2013లో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసిన రోహిత్.. తన తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసి సత్తా చాటాడు. 47 మ్యాచ్‌ల్లో 3,320 పరుగులు చేశాడు.