
IPL 2025: బాంబుల భయం.. స్టేడియం మొత్తం ఖాళీ.. ఛీర్‌లీడర్ వీడియో వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ నిలిపివేశారు.
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ భద్రతా కారణాలతో మ్యాచ్‌ను నిలిపివేసినట్లు ప్రకటించింది.
ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించి, స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు తక్షణమే వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు.
జమ్ముకశ్మీర్, పఠాన్‌కోట్ ప్రాంతాల్లో పాకిస్థాన్ దాడులు చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మ్యాచ్ రద్దు తర్వాత ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ఐపీఎల్ అధికారులతో పాటు ప్రేక్షకులు స్టేడియాన్ని ఖాళీ చేశారు.
ఈ సమయంలో ఓ ఛీర్‌లీడర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
Details
ఆటగాళ్ల కోసం ప్రత్యేక రైలు సదుపాయం
వీడియోలో ఆమె చెప్పిన వివరాల ప్రకారం స్టేడియం మొత్తం ఖాళీ అయిపోయింది. మ్యాచ్ మధ్యలోనే అందరినీ పంపించారు.
చుట్టూ భయభ్రాంతి వాతావరణం. బాంబులు పడతాయేమోనన్న భయం ప్రతి ఒక్కరిలో ఉంది. ధర్మశాల విడిచి వెళ్లడం చాలా బాధగా ఉంది.
ఐపీఎల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పటికీ నేను ఎందుకు ఏడవడం లేదు తెలియడం లేదు... షాక్ లోనే ఉన్నానని ఆమె పేర్కొంది.
ఇక బీసీసీఐ ఆటగాళ్ల కోసం ప్రత్యేక రైలు సదుపాయం కల్పించింది.
ధర్మశాలలో విమానాశ్రయాల సేవలు నిలిపివేయడంతో వందే భారత్ రైలు ద్వారా ప్లేయర్లను ఢిల్లీకి తరలించారు.
రెండు జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, మ్యాచ్ అధికారులు అందులో ప్రయాణించనున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.