సూపర్ బౌలింగ్.. అక్షర పటేల్ : సాబా కరీమ్
శ్రీలంకతో జరిగిన టీ20 లో చివరి ఓవర్లో అక్షర్ పటేల్ అధ్బుతంగా బౌలింగ్ చేసి.. భారత్ కు విజయాన్ని అందించాడు. జోరుమీదున్న చమికకు షాట్ ఆడే అవకాశం ఇవ్వకుండా అక్షర్ పటేల్ కట్టుదిట్టమైన బంతులు వేసి జట్టును గట్టెక్కించాడు. ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. అక్షర్ పటేల్ బౌలింగ్ చేశాడు. అయితే మూడో బంతికి సిక్సర్ వెళ్లడంతో 3 బంతుల్లో 5 పరుగులే చేయాల్సి వచ్చింది. అయితే ఒత్తిడిలో చివరి మూడు బంతులను అక్షర్ ఎంతో కట్టుదిట్టంగా వేశాడు. చమికకు షాట్ ఆడే అవకాశమే ఇవ్వలేదు. ఆఖరి బంతికి 4 పరుగులు అవసరం కాగా.. చమిక గట్టిగా ప్రయత్నించినా బౌండరీ రాకపోవడంతో భారత్ విజయాన్ని అందుకుంది.
బ్యాటింగ్‌లోనూ రాణించాడు
దీనిపై భారత్ మాజీ ప్లేయర్ సాబా కరీమ్ స్పందించారు. అక్షర్ చాలా తెలివిగా బౌలింగ్ చేశాడు. ఆఖరి ఓవర్ ని ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ ఇవ్వడం సరైన నిర్ణయమని కొనియాడారు. అక్షర్ ఫుల్ లెంగ్త్ డెలివరీలను బ్యాట్ మెన్ ఆడడం కష్టంగా మారింది. ముఖ్యంగా బౌలింగ్ పాటు బ్యాటింగ్ లోనూ అక్షర్ పటేల్ రాణించాడు. 20 బంతుల్లో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీపక్ హుడాతో కలిసి 68 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంపై సాబా కరీమ్ హర్షం వ్యక్తం చేశారు.