వెస్టిండీస్ మెంటర్‌గా బ్రియన్ లారా
వెస్టిండీస్ జట్టులో ఒకప్పుడు హడలెత్తించే బ్యాటర్లు, బౌలర్లు ఉండేవారు. క్రమంగా వెస్టిండీస్ తమ ప్రభావాన్ని కోల్పోయింది. ప్రస్తుతం వెస్టిండీస్ జాతీయ జట్టుకు ఆటగాళ్లు కరువయ్యే పరిస్థితి వచ్చింది. వివ్ రిచర్డ్స్, గ్యారీసోబర్స్, ఆంబ్రోస్, కోట్నీ వాల్ష్, బ్రియాన్ లారా ఇలా దిగ్గజాలతో కూడిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు అంటే మిగతా జట్టులకు భయం ఉండేది. ఆ తర్వాత క్రిస్‌గేల్, పొలార్డ్, బ్రావో, డారెన్‌సామీ కూడా విండీస్ జట్టును అద్భుతంగా నడిపించారు. గత మూడేళ్ల నుంచి బోర్డుకు, ఇప్పుడున్న టాప్ ఆటగాళ్లకు మధ్య వివాదం నెలకొనడంతో విండీస్ జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బ్యాటింగ్ దిగ్గజం బ్రియన్‌లారా ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు మెంటర్‌గా ఎంపికయ్యాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని శుక్రవారం ప్రకటించింది.
బ్రియన్ లారా జట్టును విజయవంతంగా నడిపించగలడు
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ జమ్మి ఆడమ్స్ ఈ విషయంపై స్పందించారు. బ్రియన్ లారా జట్టును విజయవంతంగా నడపించడానికి ఉపయోగపడతాడని చెప్పారు. తమ జట్టు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి బ్రియన్ లారా వస్తున్నందుకు జట్టులోని ఆటగాళ్లలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మళ్లీ వెస్టిండీస్ టీమ్‌తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని, జట్టు విజయవంతగా నడిపిస్తానని బ్రియన్ లారా తెలియజేశారు. లారా 17 ఏళ్ల కెరీర్ లో 131 టెస్టు మ్యాచ్ లు ఆడి 11,953 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు, 48 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 299 వన్డేలో 10,405 పరుగులు చేశాడు. వన్డేలో 19 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.