
ENG vs IND: ఒక్క ఓవర్లో మ్యాచ్‌ను మలుపు తిప్పగల బౌలర్ బుమ్రా : బ్రాడ్ ప్రశంసలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రాపై ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ప్రశంసల వర్షం కురిపించాడు.
బుమ్రాలో ఉన్న నైపుణ్యం లెజెండరీ ఆస్ట్రేలియా బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌ను గుర్తుకు తెస్తుందని వ్యాఖ్యానించాడు.
ఇటీవల బట్లర్‌తో ఓ పాడ్‌కాస్ట్‌లో బ్రాడ్ మాట్లాడారు.
బుమ్రా చాలా తక్కువ రన్అప్తో బౌలింగ్ చేస్తాడని, కానీ ఆయన బంతులు 90 మైళ్ల వేగంతో బ్యాటర్లను ఔట్ చేసే విధంగా ఉంటాయని వివరించాడు.
'బుమ్రా రన్అప్ చూస్తే 70మైళ్ల వేగంతో బంతి విసిరేలా అనిపిస్తుంది. కానీ అది అసలు కాదు. షోయబ్ అక్తర్ అయితే 100 మైళ్ల వేగంతో పరుగెత్తి 100 మైళ్ల బంతి విసిరేవాడు.
కానీ బుమ్రా తక్కువ రన్అప్తోనే అద్భుతమైన వేగంతో, అదుపుతో బౌలింగ్ చేస్తాడు.
Details
బుమ్రా అన్ని మ్యాచులను ఆడలేరు
అందుకే అతడి బంతుల్లో గల నియంత్రణ గ్లెన్ మెక్‌గ్రాత్‌ను గుర్తుచేస్తోందని బ్రాడ్ వ్యాఖ్యానించాడు. అలాగే బుమ్రా ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడలేడని, ఇంగ్లండ్ టీమ్ కూడా అదే కోరుకుంటోందని వ్యాఖ్యానించాడు.
'అతడు అన్ని మ్యాచ్‌లు ఆడితే ఎన్నో వికెట్లు పడతాయి. ఒక్క ఓవర్లో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సామర్థ్యం బుమ్రాకు ఉంది. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న అద్భుత బౌలర్లలో బుమ్రా అగ్రస్థానంలో ఉన్నారని బ్రాడ్ చెప్పుకొచ్చాడు.
వర్క్‌లోడ్ కారణంగా బుమ్రా ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో కేవలం మూడు మ్యాచ్‌లకే పరిమితమవనున్నాడు.
అయితే అతడు ఏ మ్యాచ్‌లలో బరిలోకి దిగతాడన్న విషయం ఇంకా స్పష్టతలేకపోయింది. సిరీస్ తీవ్రతను బట్టి ఎంపిక జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.