Page Loader
టీమిండియా టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎంట్రీ..?
కామెరాన్ గ్రీన్ ఇప్పటివరకు 18 టెస్టులు ఆడాడు

టీమిండియా టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎంట్రీ..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 30, 2023
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

డబ్ల్యూటీసీ 2021-23లో భాగంగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా భారత పర్యటనకు రానుంది. ఫిబ్రవరి 9-మార్చి 13 వరకు ఈ టెస్టు సిరీస్‌ జరగనుంది. నాగ్‌పూర్‌ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియా జట్టుకు శుభవార్త అందనుంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో గాయపడిన ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ కామెరాన్ గ్రీన్ గాయపడిన విషయం తెలిసిందే. తన చేతి వేలి గాయం నుంచి త్వరగా కోలుకుంటున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్, నాగ్‌పూర్‌లో జరిగే సిరీస్‌లో పాల్గొనడానికి గ్రీన్ ఫిట్‌గా ఉంటాడని వెల్లడించారు. ఈ నిర్ణయంపై ఆసీసీ బోర్డు ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు

ఆస్ట్రేలియా

టెస్టు సిరీస్‌కు ఎంపికైన ఆస్ట్రేలియా జట్టు ఇదే..

డిసెంబర్ 2020లో గ్రీన్ టెస్టులో అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకూ 18 టెస్టులు ఆడిన గ్రీన్ 35.04 సగటుతో 806 పరుగులు చేశారు. ఇందులో ఆరు అర్ధసెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ లో 29.78 సగటుతో 23 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా గ్రీన్ 140 కిలోమీటర్ల వేగంలో బంతిని విసిరే సామర్థ్యం ఉంది. ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: పాట్ కమ్మిన్స్ (సి), అష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియోన్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్‌వేషా స్మిత్ (విసి), మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్.