Page Loader
ఆస్ట్రేలియా టెస్టు జట్టులో టాడ్ మర్ఫీకి చోటు
ఆస్ట్రేలియా టెస్ట్ జట్టులో చోటు సంపాదించుకున్న టాడ్ మర్ఫీ

ఆస్ట్రేలియా టెస్టు జట్టులో టాడ్ మర్ఫీకి చోటు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2023
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే నెల నుంచి ఆస్ట్రేలియా జట్టు భారత్ లో పర్యటించనుంది. ఇండియాతో నాలుగు టెస్టు మ్యాచ్ లను ఆడనుంది. ఫిబ్రవరి 9 నుంచి ఆడనున్న ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 18 మంది సభ్యులతో కూడిన టీమ్ ను ప్రకటించింది. ఇందులో స్పిన్నర్లకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీ తొలిసారి క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డు నుంచి పిలుపు అందుకున్నాడు. మర్ఫీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విక్టోరియా, ఆస్ట్రేలియా 'ఎ' జట్టు తరఫున ఏడాది కాలంగా మంచి ప్రదర్శన కనబరిచాడు. మర్ఫీ 2022కి ముందు ఒకే ఒక్క ఫస్ట్-క్లాస్ గేమ్ ఆడాడు. ఇప్పటి వరకు 17.71 సగటుతో 14 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా టెస్టు జట్టు ఇదే..

మిచెల్ స్టార్క్ గాయం నుంచి కోలుకోవడంతో నాగ్‌పూర్‌లో జరిగే మొదటి టెస్టు మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు. ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ చేరికతో ఆస్ట్రేలియా జట్టు మరింత పటిష్టంగా కనిపిస్తోంది. రెండు, మూడవ టెస్టుల మధ్య వారం రోజుల గ్యాప్ ఉన్నందున, ఆస్ట్రేలియా జట్టులో ఏవైనా అవసరమైన సర్దుబాట్లు చేయడానికి సమయం ఉండే అవకాశం ఉందని బెయిలీ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (సి), అష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమెరాన్‌గ్రీన్, జోష్‌హేజిల్‌వుడ్, పీటర్ హ్యాండ్‌స్కాంబ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియోన్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్షా , స్టీవ్ స్మిత్ (VC), మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్