Page Loader
Yuzvendra Chahal: మరో అమ్మాయితో హోటల్‌లో చాహల్.. వైరల్ అవుతున్న వీడియో
మరో అమ్మాయితో హోటల్‌లో చాహల్.. వైరల్ అవుతున్న వీడియో

Yuzvendra Chahal: మరో అమ్మాయితో హోటల్‌లో చాహల్.. వైరల్ అవుతున్న వీడియో

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 08, 2025
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌, అతని భార్య ధనశ్రీ వర్మల మధ్య విడాకులు తీసుకునే వార్తలు ఇటీవల సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, చహల్‌ తన ఖాతా నుంచి ధనశ్రీ ఫొటోలను తొలగించడం ఈ వార్తలకు మరింత బలం ఇచ్చింది. ఈ సమయంలో ఈ ఇద్దరూ విడాకుల విషయంపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. తాజాగా చహల్‌ గురించి మరో వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. ముంబైలోని ఓ హోటల్‌లో చహల్‌ ఓ అమ్మాయితో కనిపించినట్టు తెలుస్తోంది. అతడు మీడియా కెమెరాలను చూస్తూ ముఖం కప్పి హోటల్ నుంచి బయటకు వచ్చాడు.

Details

ధనశ్రీకి ముందు తనిష్కతో డేటింగ్

ఆ సమయంలో ఆ అమ్మాయి అతని వెనకాల ఉంది. ఈ వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఇద్దరి మధ్య సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ మిస్టరీ గర్ల్‌ పేరు తనిష్క కపూర్‌ అని తెలుస్తోంది, ఆమె కన్నడ చిత్రాలలో నటించింది. చహల్‌, ధనశ్రీకి ముందు కూడా తనిష్కతో డేటింగ్ చేశాడని సమాచారం. పెళ్లి తరువాత కూడా తనిష్కతో సీక్రెట్‌ అఫైర్‌ నడిపిస్తున్నాడని ఇటీవల వివాదాలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం వల్లనే చహల్‌, ధనశ్రీ మధ్య గొడవలు మొదలైనట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ధనశ్రీ విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారని కూడా సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో