Yuzvendra Chahal: మళ్లీ వివాదంలో చాహల్.. నటికి 'క్యూట్' అంటూ మెసేజ్?
ఈ వార్తాకథనం ఏంటి
భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి అతని ప్రదర్శన కాదు, కొత్త వివాదమే కారణం. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి వ్యక్తిగత సందేశం పంపాడని నటి, మోడల్ తాన్య చటర్జీ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. కొద్దిరోజుల క్రితమే సిగరెట్ తాగుతూ రోడ్డుపై పడేశాడనే ఆరోపణలు ఎదుర్కొన్న చాహల్‌కు, ఈ కొత్త వివాదం మరింత తలనొప్పిగా మారింది. గాండీ బాత్', 'టిట్లియాన్' వంటి ఓటీటీ షోలతో గుర్తింపు పొందిన తాన్యా ఛటర్జీ ఇటీవల మీడియాతో మాట్లాడింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బాక్స్‌ను చూపిస్తూ, తన స్టోరీకి స్పందిస్తూ చాహల్ 'ఆప్ క్యూట్ హో' అని మెసేజ్ పంపాడని ఆరోపించింది.
వివరాలు
ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ వివాదానికి ముందు కూడా చాహల్ మరో అంశంపై విమర్శలు ఎదుర్కొన్నాడు. కారు నడుపుతూ సిగరెట్ తాగి, దాన్ని రోడ్డుపై పడేస్తున్నట్లు కనిపించిన వీడియో వైరల్ కావడంతో, అందులో ఉన్నది చాహలేనని నెటిజన్లు ఆరోపిస్తూ తీవ్రంగా విమర్శించారు. వ్యక్తిగత జీవిత పరంగా కూడా చాహల్ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నాడు. 2025లో తన భార్య ధనశ్రీ వర్మ నుంచి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆర్జే మహవాష్‌తో సన్నిహితంగా ఉన్నట్లు వార్తలొచ్చాయి. కొద్ది రోజులకే ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఆ ప్రచారానికి ముగింపు పడింది.
వివరాలు
మద్యం మానేసి ఆరు నెలలు అయ్యింది
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న చాహల్, ఇప్పటివరకు 4 మ్యాచ్‌లలో 3 వికెట్లు తీసి ఫర్వాలేదనిపిస్తున్నాడు. మైదానం బయట వివాదాలు కొనసాగుతున్నా, తన ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి పెట్టినట్లు ఇటీవల వెల్లడించాడు. "నేను మద్యం సేవించడం మానేసి ఆరు నెలలకు పైగా అయింది. ఇప్పుడు నా వయసు 35. జట్టు కోసం 150 శాతం కష్టపడాలని ఉంది. ఒక సీనియర్ ఆటగాడిగా ఇతరులకు స్ఫూర్తి కావాలని ఏబి డివిలియర్స్ పోడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు. గత సీజన్‌లో పంజాబ్ జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన చాహల్, ఈసారి టైటిల్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.