LOADING...
Team India: టీ20 తర్వాత టీమిండియాలో మార్పులు.. సూర్యకు వీడ్కోలు, గిల్‌కు కెప్టెన్సీ?
టీ20 తర్వాత టీమిండియాలో మార్పులు.. సూర్యకు వీడ్కోలు, గిల్‌కు కెప్టెన్సీ?

Team India: టీ20 తర్వాత టీమిండియాలో మార్పులు.. సూర్యకు వీడ్కోలు, గిల్‌కు కెప్టెన్సీ?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 08, 2026
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్ 2026 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం యువ స్టార్ బ్యాటర్ శుభమాన్ గిల్ టీమిండియా కొత్త టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గిల్ టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఇదే క్రమంలో టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ కూడా అతనికే అప్పగించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ గతంలో కూడా మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్‌ను కొనసాగించే విధానాన్ని అనుసరించిన విషయం తెలిసిందే.

Details

టీ20 జట్టుకు కొత్త నాయకత్వం అవసరం

ఇక ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్, ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకవచ్చనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే టీ20 జట్టుకు కొత్త నాయకత్వం అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ గిల్‌కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌ను మూడు ఫార్మాట్లకు వైస్ కెప్టెన్‌గా నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదుగుతున్న జైస్వాల్‌ను భవిష్యత్ నాయకత్వానికి సిద్ధం చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

Details

టీ20 కెప్టెన్ రేసులో శ్రేయస్ అయ్యర్

మరోవైపు టీ20 కెప్టెన్ రేసులో శ్రేయస్ అయ్యర్ పేరు కూడా వినిపించింది. అయితే అతను తరచూ ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటుండటం, ప్రధానంగా వన్డే ఫార్మాట్‌కే ఎక్కువగా పరిమితమవుతున్న పరిస్థితి కారణంగా కెప్టెన్సీ అవకాశాలు తగ్గినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా నాయకత్వంలో పెద్ద మార్పులు జరిగే అవకాశం ఉంది. యువ ఆటగాళ్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కొత్త వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement