Loading...
India vs New Zealand: మూడో వన్డే తర్వాత టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు.. రెండు గ్రూపులుగా విడిపోనున్న సిబ్బంది!
మూడో వన్డే తర్వాత టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు.. రెండు గ్రూపులుగా విడిపోనున్న సిబ్బంది!

India vs New Zealand: మూడో వన్డే తర్వాత టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు.. రెండు గ్రూపులుగా విడిపోనున్న సిబ్బంది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2026
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్‌తో మూడో వన్డే మ్యాచ్‌ అనంతరం భారత జట్టు కోచింగ్ స్టాఫ్ రెండు గ్రూపులుగా విడిపోనుంది. ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది. హామిల్టన్ వేదికగా మంగళవారం జరగనున్న మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వన్డే జట్టుతోనే కొనసాగనున్నప్పటికీ.. కోచింగ్ స్టాఫ్‌లో కొందరు టెస్టు జట్టుతో కలిసి వెలింగ్టన్‌కు వెళ్లనున్నట్లు తెలిపాడు.

వివరాలు

గంభీర్ వన్డే జట్టుతోనే.. మిగతా సిబ్బంది టెస్టు జట్టుతో!

కోచింగ్ స్టాఫ్ ప్రయాణ ప్రణాళికలపై సితాన్షు కోటక్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి గౌతమ్ గంభీర్ వన్డే జట్టుతోనే ఉండనున్నట్లు వెల్లడించాడు.

వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో గంభీర్‌తో పాటు స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులే కూడా వన్డే జట్టుతోనే కొనసాగుతారని తెలిపాడు.

తాను, మోర్నీ మోర్కెల్‌తో పాటు ఇతర కోచింగ్ సిబ్బంది వెలింగ్టన్‌కు వెళ్లనున్నట్లు వివరించాడు. అయితే ప్రణాళికల్లో ఎప్పుడైనా మార్పులు ఉండవచ్చని, చివరకు గౌతమ్ గంభీర్ నిర్ణయమే కీలకమని స్పష్టం చేశాడు.

టెస్టు జట్టు ప్రాక్టీస్, ఆటగాళ్ల ఫిట్‌నెస్ వంటి అంశాలపై అక్కడ దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నాడు.

వివరాలు

గుర్నూర్, అకిబ్, అర్ష్‌దీప్ సేవలు కూడా..

వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కూడా గుర్నూర్ బ్రార్, అకిబ్ నబీ, అర్ష్‌దీప్ సింగ్ న్యూజిలాండ్‌లోనే ఉండనున్నట్లు కోటక్ వెల్లడించాడు.

టెస్టు జట్టు బ్యాటర్లకు సహాయం చేసేందుకు వీరి సేవలను ఉపయోగించుకోనున్నట్లు తెలిపాడు. నెట్ బౌలర్లుగా, రిజర్వ్ ప్లేయర్లుగా వారు అందుబాటులో ఉంటారని వివరించాడు.

వన్డే ఫార్మాట్ నుంచి టెస్టులకు మారడం బ్యాటర్లకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని కోటక్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం ఉపయోగిస్తున్న పిచ్‌లు కూడా స్వింగ్, బౌన్స్‌కు అనుకూలంగా ఉన్నాయని చెప్పాడు.

టెస్టు మ్యాచ్‌ల సమయంలోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని పేర్కొన్నాడు. టెస్టు సిరీస్ కోసం సన్నాహాలను కఠినంగా నిర్వహించనున్నట్లు తెలిపాడు.

బుధవారం నుంచి టెస్టు ప్రాక్టీస్ ప్రారంభమవుతుందని, ఐదారు ప్రాక్టీస్ సెషన్లు ఉంటాయని వెల్లడించాడు.

ADVERTISEMENT

వివరాలు

కేఎల్ రాహుల్ ఆటతీరుపై కోటక్ ప్రశంసలు

ఇక టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆటతీరుపై సితాన్షు కోటక్ ప్రశంసలు కురిపించాడు.

టెస్టుల్లో ఓపెనింగ్ చేయడం, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయడం రాహుల్‌కు పెద్ద అడ్వాంటేజ్ అని పేర్కొన్నాడు.

జట్టుకు ఎప్పుడు అవసరమైనా అతడు ముందుంటాడని చెప్పాడు. తాను జట్టులో చేరినప్పటి నుంచి రాహుల్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చి విఫలమైన సందర్భాలు గుర్తులేవని కోటక్ తెలిపాడు.

అతడు ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడని, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించడని ప్రశంసించాడు.

ADVERTISEMENT