Page Loader
MI vs CSK: ముంబయి ఇండియన్స్‌ని మట్టికరిపించిన చెన్నై!
ముంబయి ఇండియన్స్‌ని మట్టికరిపించిన చెన్నై!

MI vs CSK: ముంబయి ఇండియన్స్‌ని మట్టికరిపించిన చెన్నై!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 24, 2025
12:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025లో చైన్నై సూపర్ కింగ్స్ (CSK) విజయంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. చెపాక్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. చెన్నై బ్యాటింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (53; 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రచిన్‌ రవీంద్ర (65*; 45 బంతుల్లో 4 సిక్స్‌లు, 2 ఫోర్లు) అర్ధశతకాలతో జట్టును గెలుపు దిశగా నడిపించారు. రవీంద్ర జడేజా (17) కొంత తోడ్పాటు అందించగా, రాహుల్ త్రిపాఠి (2), శివమ్ దూబె (9), దీపక్ హుడా (3) విఫలమయ్యారు.

 Details

 తేలిపోయిన ముంబయి బ్యాటర్లు 

ముంబయి బౌలర్లు మొదట తేలిపోయినా ఆపై పుంజుకుని వికెట్లు తీయడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. అయితే, రచిన్‌ చివరి వరకు క్రీజులో నిలిచిపడి చెన్నైను గెలిపించాడు. ముంబయి బౌలర్లలో అరంగేట్ర ఆటగాడు విఘ్నేశ్ పుతూర్ (3/32) ఆకట్టుకోగా, దీపక్ చాహర్, విల్ జాక్స్ తలో వికెట్ తీశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేసింది. తిలక్ వర్మ (31; 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ముంబయి తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ (29; 26 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగైన ప్రయత్నం చేశాడు.

Details

రోహిత్ శర్మ డకౌట్

రోహిత్ శర్మ డకౌట్ కాగా, నమన్ ధీర్ (17), రియాన్ రికెల్‌టన్ (13), విల్ జాక్స్ (11), రాబిన్ మింజ్ (3), మిచెల్ శాంట్నర్ (11) తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు. చివర్లో దీపక్ చాహర్ 28 పరుగులతో రాణించడంతో ముంబయి స్కోరు 150 దాటింది. వికెట్ల పతనంతో కుదేలైన ముంబయి ముంబయి 36 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. అనంతరం తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ నాలుగో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4 వికెట్లు), ఖలీల్ అహ్మద్ (3 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్, నాథన్ ఎల్లిస్ తలో వికెట్ తీసి ముంబయిని దెబ్బతీశారు.

Details

 ఓటముల్లో ముంబయి రికార్డు 

ఐపీఎల్ సీజన్ ఆరంభ మ్యాచ్‌లలో ఓటమిపాలవుతున్న ముంబయి ఇండియన్స్, ఈసారి కూడా అదే పరంపరను కొనసాగించింది. చెన్నై చేతిలో ఓడిపోవడం ద్వారా ముంబయికి ఇది వరుసగా 13వ సీజన్ ఓటమిగా నమోదైంది. 2012లో గెలిచిన తర్వాత ముంబయి ఇప్పటి వరకు ఒక్కసారికూడా తొలి మ్యాచ్‌లో గెలవలేకపోయింది.