
KKRvs CSK: కోల్‌కతా ఓటమి.. చెన్నైకి మూడో విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 18 లో కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు పరాజయం ఎదురైంది.
ఈడెన్ గార్డెన్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి కీలకమైన గెలుపు నమోదు చేసింది.
ఈ ఓటమి కారణంగా కోల్‌కతా ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది.
ఈ ఇన్నింగ్స్‌లో అజింక్యా రహానె 48 పరుగులు చేసి జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించాడు.
వివరాలు
కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా 3 వికెట్లు
ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 19.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.
డెవాల్డ్ బ్రెవిస్ 52 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి విజయానికి బాటలు వేసాడు.
అతనికి తోడుగా శివమ్ దూబె 45 పరుగులు చేయగా, తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ఉర్విల్ పటేల్ కేవలం 11 బంతుల్లో 31 పరుగులు (1 ఫోర్, 4 సిక్స్‌లు) చేసి అందరినీ ఆకట్టుకున్నాడు.
కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా 3 వికెట్లు తీసి కీలకంగా రాణించగా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా తలతలా 2 వికెట్లు తీశారు. మొయిన్ అలీకి ఒక వికెట్ దక్కింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 2 వికెట్ల తేడాతో గెలుపు
Chennai Super Kings ROAR LOUD!
— SPORTS WIZ (@mysportswiz) May 7, 2025
A high-scoring thriller ends with Chennai Super Kings won by 2 wkts !
Scorecard:
CSK – 183/8 (19.4 overs)
KKR – 179/6 (20 overs)
Kolkata Knight Riders vs Chennai Super Kings, 57th IPL Match 2025.https://t.co/7Wm3X0SNBU#TestCricket #ARSPSG… pic.twitter.com/5REfRoPH3Z