
CSK vs PBKS : చెన్నై వర్సెస్ పంజాబ్.. ఇవాళ 5 రికార్డులు బద్దలయ్యే అవకాశం!
ఈ వార్తాకథనం ఏంటి
2025 ఐపీఎల్ సీజన్‌లో బుధవారం (ఏప్రిల్ 30) చెపాక్ మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్, రెండు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది.
మిగతా 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.
ప్రస్తుతానికి 4 పాయింట్లు, నెట్‌రన్‌రేట్ -1.302తో చెన్నై పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. పంజాబ్‌తో ఈ మ్యాచ్‌లో ఓడితే చెన్నై ప్లేఆఫ్స్ రేసు నుండి నిష్క్రమిస్తుంది.
Details
ఐదో స్థానంలో పంజాబ్
పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే, ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లలో 5 విజయం సాధించింది. మూడింట్లో ఓడింది, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో, ప్రస్తుతం ఆ జట్టు 11 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.
పంజాబ్ కింగ్స్ చెన్నైతో మ్యాచ్‌లో విజయం సాధిస్తే టాప్-4లోకి ప్రవేశిస్తుంది.
ఇప్పుడు, చెన్నై-పంజాబ్ మ్యాచ్‌లో ఐదు రికార్డులు బద్దలు పడే అవకాశాలు ఉన్నాయి.
Details
1. రెండు వికెట్లు తీస్తే
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లలో 6 వికెట్లు తీశాడు. మొత్తంగా 139 వికెట్లు తీశారు.
ఇక డ్వేన్ బ్రావో (140 వికెట్లు)ను అధిగమించడానికి మరో రెండు వికెట్లు తీస్తే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు.
2. 11 ఫోర్లు కొడితే
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్‌లో 288 పరుగులు చేశారు.
మరో 11 ఫోర్లు కొడితే ఐపీఎల్‌లో 300 ఫోర్ల మైలురాయిని చేరుకుంటాడు. ఇప్పటివరకు అతడు 289 ఫోర్లు కొట్టాడు.
Details
3. 4 సిక్సులు కొడితే
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, 350 సిక్సుల మైలురాయిని చేరుకుంటాడు. ప్రస్తుతం అతడికి మరొక 4 సిక్సులు అవసరం.
4. 5 పరుగులు చేస్తే
పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్, 6500 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి 5 పరుగులు అవసరం.
అలాగే, ఐపీఎల్‌లో 2 వేల పరుగుల మార్క్‌ను చేరడానికి అతడికి 67 పరుగులు అవసరం.
5. 87 పరుగులు చేస్తే
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రచిన్ రవీంద్ర, 500 ఐపీఎల్ పరుగుల మైలురాయిని చేరడానికి 87 పరుగులు చేయాలి. ఇప్పటివరకు అతడు 413 పరుగులు చేశాడు.