Page Loader
సూర్యకుమార్ యాదవ్..  కొన్ని బంతులను ఎదుర్కో : రవిశాస్త్రి
సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌పై స్పందించిన రవిశాస్త్రి

సూర్యకుమార్ యాదవ్.. కొన్ని బంతులను ఎదుర్కో : రవిశాస్త్రి

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2023
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల పేలవ ఫామ్‌లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో వరుసగా మూడుసార్లు డకౌట్ అయి చెత్త రికార్డును మూటు కట్టుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో కూడా చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో డకౌట్ అయి పెవిలియానికి చేరాడు. సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. సూర్య వచ్చిన రాగానే భారీ షాట్లకు ప్రయత్నించకుండా కొంచెం సమయం తీసుకోవాలని సూచించారు. మొదట బంతిని ఆర్థం చేసుకోవాలని చెప్పారు.

సూర్యకుమార్

మూడు మ్యాచ్‌లో 16 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్

ఆరంభంలో సూర్యకుమార్ అచుతూచీ ఆడాలని, అంటే 20 నిమిషాలు కాకుండా ఒక ఆరు లేదా ఎనిమిది బంతులను ఎదుర్కొంటే సూర్యకి పరిస్థితులు అర్థమవుతాయని రవిశాస్త్రి చెప్పారు. సూర్య త్వరలోనే పుంజుకుంటాడని, విమర్శకుల నోరును ఖచ్చితంగా మూయిస్తాడని, తాను ఫామ్ లోకి వస్తే జట్టు తప్పక విజయం సాధిస్తామని రవిశాస్త్రి ధీమా వ్యక్తం చేశారు. ఇక ఐపీఎల్ లో మూడు మ్యాచ్ లు ఆడిన సూర్య కేవలం 16 పరుగులను మాత్రమే చేశాడు. ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 16న కోల్ కత్తా నైట్ రైడర్స్ తో తలపడనుంది.