Page Loader
తీవ్ర గాయంతో మైదానాన్ని వీడిన సూర్యకుమార్ యాదవ్
ఢిల్లీ మ్యాచ్‌లో గాయపడిన సూర్యకుమార్ యాదవ్

తీవ్ర గాయంతో మైదానాన్ని వీడిన సూర్యకుమార్ యాదవ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2023
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు ఐపీఎల్ కలిసి రావడం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా మూడుసార్లు డకౌట్ అయి చెత్త రికార్డును మూటకట్టుకున్నాడు. ఈ ఐపీఎల్‌లో కూడా ఫామ్ లో లేక సతమతమవుతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌లోనూ సూర్యకుమార్ యాదవ్ విఫలమయ్యాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తీవ్రంగా గాయపడటంతో మైదానాన్ని వీడాడు. 17 ఓవర్‌లో అక్షర పటేల్ భారీ షాట్‌ను బాదాడు. ఆ క్యాచ్ ను అందుకొనే క్రమంలో సూర్యకుమార్ కంటిపై బాల్ పడి, బౌండరీల లైన్ అవతల పడింది.

సూర్యకుమార్ యాదవ్

మళ్లీ డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్

ఈ క్రమంలో సూర్యకుమార్ నొప్పితో విలవిలలాడారు. వెంటనే మైదానాన్ని వీడారు. అనంతరం లక్ష్య చేధనకు ముంబై బ్యాటింగ్ దిగింది. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ ఔట్ అయిన వెంటనే సూర్యకుమార్ క్రీజులోకి దిగాడు. ఇందులో ఒక బంతిని ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్(0).. భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియానికి చేరాడు. ఈ మ్యాచ్‌లో డకౌట్ తో సూర్యకుమార్ వెనుతిరగడం పై విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ మ్యాచ్‌లో చివరి బంతికి ముంబై విజయం సాధించింది. గాయం భారీన పడిన ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తర్వాతి మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడో లేదా వేచిచూడాలి