LOADING...
Cooper Connolly : కూపర్ కొన్నోలీ రికార్డ్.. ఐపీఎల్‌లో అలాంటి సెంచరీ సాధించిన ఏకైక విదేశీ ఆటగాడు!
కూపర్ కొన్నోలీ రికార్డ్.. ఐపీఎల్‌లో అలాంటి సెంచరీ సాధించిన ఏకైక విదేశీ ఆటగాడు!

Cooper Connolly : కూపర్ కొన్నోలీ రికార్డ్.. ఐపీఎల్‌లో అలాంటి సెంచరీ సాధించిన ఏకైక విదేశీ ఆటగాడు!

వ్రాసిన వారు Moogati Shabari
May 07, 2026
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్ కింగ్స్ ఆటగాడు కూపర్ కొన్నోలీ అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన విదేశీ ఆటగాడిగా అతడు నిలిచి చరిత్ర సృష్టించాడు. బుధవారం ఉప్పల్ మైదానంలో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు శతకం బాదడం ద్వారా ఈ రికార్డును తన పేరుమీద లిఖించుకున్నాడు. ఈ క్రమంలో కూపర్ కొన్నోలీ, క్వింటన్ డికాక్‌ను అధిగమించాడు. 2016లో ఢిల్లీ జట్టుకు ఆడుతున్న సమయంలో ఆర్‌సీబీపై డికాక్ 23 ఏళ్ల 122 రోజుల వయసులో సెంచరీ చేశాడు. అయితే తాజాగా కొన్నోలీ కేవలం 22 ఏళ్ల 257 రోజుల్లోనే శతకం నమోదు చేశాడు.

వివరాలు

ఐపీఎల్‌లో అతి తక్కువ వయసులో సెంచరీ చేసిన విదేశీ ఆటగాళ్ల జాబితా ఇదే..

కూపర్ కొన్నోలీ - 22 ఏళ్ల 257 రోజులు (2026లో పంజాబ్ తరఫున సన్‌రైజర్స్‌పై) క్వింటన్ డికాక్ - 23 ఏళ్ల 122 రోజులు (2016లో ఢిల్లీ తరఫున ఆర్‌సీబీపై) డేవిడ్ వార్నర్ - 23 ఏళ్ల 153 రోజులు (2010లో ఢిల్లీ తరఫున కేకేఆర్‌పై) డేవిడ్ మిల్లర్ - 23 ఏళ్ల 330 రోజులు (2013లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆర్‌సీబీపై) కామెరూన్ గ్రీన్ - 23 ఏళ్ల 352 రోజులు (2023లో ముంబై తరఫున సన్‌రైజర్స్‌పై)

వివరాలు

ఇన్నింగ్స్ సాగిందిలా..

మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. జట్టులో హెన్రిచ్ క్లాసెన్ 69 పరుగులు (43 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్ కిషన్ 55 పరుగులు (32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు)తో అర్ధ శతకాలు సాధించారు. పంజాబ్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, ఫెర్గూసన్, చాహల్, విజయ్‌కుమార్ వైశాక్ ఒక్కో వికెట్ తీశారు. తర్వాత 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 202 పరుగులకే పరిమితమైంది. దీంతో 33 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కొంది.

Advertisement