LOADING...
Team India: జూన్‌లో క్రికెట్ జాతర.. టీమ్ ఇండియా షెడ్యూల్ ఫుల్ బిజీ!
జూన్‌లో క్రికెట్ జాతర.. టీమ్ ఇండియా షెడ్యూల్ ఫుల్ బిజీ!

Team India: జూన్‌లో క్రికెట్ జాతర.. టీమ్ ఇండియా షెడ్యూల్ ఫుల్ బిజీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 25, 2026
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 19వ సీజన్ క్రికెట్ అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. మే 31న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ఈ సీజన్ ముగియనుంది. అయితే అభిమానులకు క్రికెట్ మజా అక్కడితో ఆగదు. కొద్ది రోజుల వ్యవధిలోనే ఇంటర్నేషన్ క్రికెట్ టీం మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీ కానుంది. జూన్ నెలలో భారత జట్టు మొత్తం ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. టెస్టులు, వన్డేలు, టీ20లతో కూడిన ఈ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లకు విశ్రాంతికి పెద్దగా సమయం దక్కే పరిస్థితి లేదు. ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు ఐర్లాండ్‌తో కూడా భారత జట్టు సిరీస్‌లు ఆడనుంది.

వివరాలు

ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్

భారత్ జూన్‌లో ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టుతో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన భారత జట్టును ప్రకటించారు. జూన్ 6 నుంచి న్యూ చండీగఢ్‌లో ఈ టెస్ట్ ప్రారంభం కానుంది. ఇది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగం కాకపోయినా.. జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకు కీలకంగా భావిస్తున్నారు. మ్యాచ్ పూర్తి ఐదు రోజులు కొనసాగితే జూన్ 10 వరకు సాగనుంది.

వివరాలు

మూడు వన్డేల సిరీస్

టెస్ట్ మ్యాచ్ అనంతరం భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు మూడు వన్డేల సిరీస్‌లో తలపడనున్నాయి. తొలి వన్డే జూన్ 14న, రెండో మ్యాచ్ జూన్ 17న, మూడో మరియు చివరి వన్డే జూన్ 20న జరుగుతుంది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు సన్నాహాల దృష్ట్యా ఈ సిరీస్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు కూడా జట్టులో చోటు కల్పించారు. కోహ్లీ ఆడటం దాదాపు ఖాయంగా కనిపిస్తుండగా.. రోహిత్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

వివరాలు

ఐర్లాండ్ పర్యటన

ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ అనంతరం భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ రెండు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. భారత్-ఐర్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జూన్ 26న, రెండో మ్యాచ్ జూన్ 28న జరగనుంది. ఈ పర్యటన తర్వాత టీమ్ ఇండియా ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది. అక్కడ జూలైలో మరిన్ని మ్యాచ్‌లు ఆడనుంది. మొత్తంగా చూస్తే.. వచ్చే నెల మొత్తం క్రికెట్ సందడితో నిండిపోనుంది. మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టు ఎలా రాణిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisement