ఐసీసీ ర్యాంకింగ్స్ లో మూడవ స్థానంలో ఇండియా; మొదటి రెండు స్థానాల్లో ఎవరున్నారంటే?
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ - దుబాయ్, ఈరోజు మెన్స్ టీమ్ ర్యాంకులను వెల్లడి చేసింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా టాప్ లో ఉంది. 118రేటింగ్ తో అందరి కంటే ముందంజలో ఉంది. ఇక ఇండియాకు మూడవ స్థానం దక్కింది. 115రేటింగ్ సొంతం చేసుకుని మూడవ స్థానంలో నిలిచింది. ఇక రెండవ స్థానంలో 116రేటింగ్ తో పాకిస్తాన్ ఉంది. నాలుగవ స్థానంలో న్యూజిలాండ్ (104 రేటింగ్), ఐదవ స్థానంలో ఇంగ్లండ్ (101 రేటింగ్), ఆరవ స్థానంలో దక్శిణాఫ్రికా (101 రేటింగ్) ఉన్నాయి. ఏడవ స్థానంలో బంగ్లాదేశ్ ( 97 రేటింగ్), ఎనిమిదవ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ (88 రేటింగ్), తొమ్మిదవ స్థానంలో శ్రీలంక (80 రేటింగ్), పదవ స్థానంలో వెస్ట్ ఇండీస్ (72 రేటింగ్) ఉన్నాయి.