Page Loader
Shane Watson: 'ధోనీ ముందుగా వచ్చి ఉంటే సీఎస్కే గెలిచేది'.. షేన్ వాట్సన్ 
'ధోనీ ముందుగా వచ్చి ఉంటే సీఎస్కే గెలిచేది'.. షేన్ వాట్సన్

Shane Watson: 'ధోనీ ముందుగా వచ్చి ఉంటే సీఎస్కే గెలిచేది'.. షేన్ వాట్సన్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 29, 2025
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోని(MS Dhoni) బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా వచ్చి ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) విజయం సాధించి ఉండేదని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ (Shane Watson) అభిప్రాయపడ్డాడు. ధోనీ బ్యాటింగ్‌ను అభిమానులు ఆస్వాదిస్తున్నారని, అతడు మరింత ముందుగా వచ్చి ఉంటే సీఎస్కే విజయావకాశాలు మెరుగ్గా ఉండేవని చెప్పాడు. ధోనీ కేవలం 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అతడు బ్యాటింగ్ ఆర్డర్‌లో అశ్విన్ (Ravichandran Ashwin) కన్నా ముందుగా వచ్చి ఉంటే మరింత ప్రభావశీలంగా ఆడేవాడని, మరో 15 బంతులు ఆడి ఉంటే చెన్నై గెలిచేదని వాట్సన్ వ్యాఖ్యానించాడు. ధోనీ 43 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన వికెట్ కీపింగ్ చేస్తున్నాడని కొనియాడాడు.

Details

దీపక్ హుడా రాణించాలి

కానీ సీఎస్కే బ్యాటింగ్ లైనప్‌లో మార్పులు అవసరమని సూచించాడు. దీపక్ హుడా (Deepak Hooda) తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడని, సామ్ కరన్(Sam Curran)ఐదో స్థానంలో కాకుండా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలని సూచించాడు. రాహుల్ త్రిపాఠి ఓపెనర్‌గా పంపడం పొరపాటని వ్యాఖ్యానించాడు. రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) మంచి నైపుణ్యం ఉన్న ఓపెనర్ అయినా అతడిని తర్వాత బ్యాటింగ్‌కు పంపడం టీమ్ స్ట్రాటజీలో పొరపాటని తెలిపాడు. హేజిల్‌వుడ్(Josh Hazlewood)బౌలింగ్‌లో రుతురాజ్ మరింత మెరుగ్గా ఆడాల్సిందని వాట్సన్ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆర్సీబీ 50 పరుగుల తేడాతో CSKపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 196 పరుగులు చేసింది. ఛేదనలో చెన్నై 146 పరుగులకే ఆలౌటైంది.