Dasun Shanaka : సీపీఎల్‌లో దాసున్ షనక విధ్వంసం.. 39 బంతుల్లోనే శతకం!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన ఆనందంలో శ్రీలంక మాజీ కెప్టెన్ దాసున్ షనక కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2026)లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. సీపీఎల్‌లో భాగంగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ తరఫున ఆడుతున్న షనక.. సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. కేవలం 39 బంతుల్లోనే శతకం పూర్తి చేసిన షనక.. ఓవరాల్‌గా 43 బంతుల్లో 8 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 121పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో కరీబియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. ఇటీవలే షిమ్రోన్ హెట్‌మైర్ 40 బంతుల్లో సెంచరీ చేయగా.. ఇప్పుడు షనక 39 బంతుల్లోనే శతకం సాధించి ఆ రికార్డును బద్దలుకొట్టాడు.
వివరాలు
భారీ స్కోరు సాధించిన సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ జట్టు
సీపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్ల జాబితాలో షనక 39 బంతులతో అగ్రస్థానంలో నిలిచాడు.
షిమ్రోన్ హెట్‌మైర్, టిమ్ సీఫెర్ట్, ఆండ్రీ రసెల్ 40 బంతుల్లో సెంచరీలు సాధించి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
మరో వెస్టిండీస్ హిట్టర్ షెయ్ హోప్ 41 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. ఇక ఆండ్రీ రసెల్ ఖాతాలో సీపీఎల్‌లో రెండు ఫాస్టెస్ట్ సెంచరీలు ఉన్నాయి.
రసెల్ ఒకసారి 40 బంతుల్లో సెంచరీ చేయగా.. మరోసారి 42 బంతుల్లో శతకం సాధించాడు.
షనక విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 234 పరుగుల భారీ స్కోరు సాధించింది.
వివరాలు
38 బంతుల్లో 64 పరుగులు చేసిన ఆండ్రీ ఫ్లెచర్
షనకకు వికెట్ కీపర్ బ్యాటర్ ఆండ్రీ ఫ్లెచర్ అద్భుతంగా సహకరించాడు. ఫ్లెచర్ 38 బంతుల్లో 64 పరుగులతో అర్ధశతకం నమోదు చేశాడు.
అంతకుముందు ఓపెనర్ జాన్సన్ చార్లెస్ 26 పరుగులతో ఆకట్టుకున్నాడు.
సెయింట్ లూసియా కింగ్స్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డె రెండు వికెట్లు పడగొట్టగా.. శ్రీలంక స్పిన్నర్ తీక్షణ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.