Page Loader
ఆస్ట్రేలియాకు భారీ షాక్.. రెండో టెస్టుకు వార్నర్ దూరం
రెండో టెస్టుకు దూరమైన వార్నర్

ఆస్ట్రేలియాకు భారీ షాక్.. రెండో టెస్టుకు వార్నర్ దూరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 18, 2023
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా రెండు టెస్టు నుండి తప్పుకున్నాడు. వార్నర్ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా ఆసీస్ ఆటగాడు మాథ్యూ రేనేషా జట్టులోకి వచ్చాడు. రేన్‌షా ప్రస్తుతం ఫీల్డింగ్ చేస్తున్నాడు. అయితే వార్నర్ గాయం తీవ్రతపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్ వార్నర్ గాయపడిన విషయం తెలిసిందే. దెబ్బ తగిలినా వార్నర్ బ్యాటింగ్ కొనసాగించాడు. 44 బంతుల్లో 15 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.

వార్నర్

వార్నర్ గాయం తీవ్రత ఎక్కువగా ఉంది: ఉస్మాన్ ఖావాజా

సిరాజ్ వేసిన బౌన్సర్ వార్నర్ హెల్మెట్‌కు బలంగా తాకింది. ఫిజియో వచ్చి కంకషన్ టెస్ట్ నిర్వహించారు. కొద్దిసేపటికే మహమ్మద్ షమీ బౌలింగ్‌లో వార్నర్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. భారత్ బ్యాటింగ్‌ సమయంలో డేవిడ్ వార్నర్‌ ఫీల్డింగ్‌కు రాలేదు. అతడికి బదులుగా మాథ్యూ రెన్‌షా 'కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌'గా వచ్చాడు. ఉస్మాన్ ఖవాజా కూడా వార్నర్‌కు గాయం తీవ్రత ఎక్కువగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం వార్నర్‌ పేలవ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. తొలి టెస్టులో నిరాశపరిచిన వార్నర్‌.. రెండో టెస్టులో 15 పరుగులతో వెనుతిరిగాడు.