
IND vs AUS: అశ్విన్, జడేజా సూపర్.. ఆస్ట్రేలియా ఆలౌట్
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడీయం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 78.4 ఓవర్లలలో 263 పరుగులు చేసింది.
ఉస్మాన్ ఖావాజా (81), హ్యాండ్స్ కోమ్(72), కమిన్స్ (33) పరుగులతో రాణించారు. మరోసారి వార్నర్(15), స్టీవ్ స్మీత్(0) నిరాశపర్చారు. టీమిండియా బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు, అశ్విన్, జడేజా మూడు వికెట్లు తీసి రాణించారు.
మొదట్లో వార్నర్ ధాటిగా ఆడకపోయినా.. ఖవాజా మాత్రం చక్కటి షాట్లతో అలరించాడు. దీంతో ఇద్దరు ఓపెనింగ్ వికెట్‌కు 50 పరుగులు జోడించారు. వార్నర్ ని షమీ ఔట్ చేసి, వారి భాగస్వామ్యానికి బ్రేక్ వేశాడు.
షమీ
అద్భుతంగా బౌలింగ్ చేసిన షమీ
లబుషేన్, ఖవాజా రెండో వికెట్‌కు 41 పరుగులు జోడించారు. అయితే కేవలం మూడు బంతుల వ్యవధిలోనే కీలకమైన లబుషేన్ ,స్టీవ్ స్మిత్ వికెట్లు తీసి అశ్విన్ సత్తా చాటాడు. ఆసీస్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ట్రావిస్ హెడ్(12) నిరాశ పర్చాడు. అయితే హ్యాండ్ కాంబ్(67)తో కలిసి ఖవాజా 59 పరుగులు జోడించారు.
ఖావాజా వికెట్ ను జడేజా తీయడంతో అభిమానులు ఖుషీ అయ్యారు. కెప్టెన్ కమిన్స్ (33) చివర్లో దూకుడుగా ఆడాడు. హ్యాండ్స్‌కాంబ్‌ను మినహాయించి మిగతా లోయర్ ఆర్డర్ బ్యాటర్లను జడేజా, షమీ ఔట్ చేయడంతో ఆసీస్ ఆలౌటైంది.