Page Loader
రెండో టెస్టులో రికార్డులను సాధించిన భారత స్పిన్నర్లు
రెండు టెస్టులో అరుదైన ఘనత సాధించిన జడేజా, అశ్విన్

రెండో టెస్టులో రికార్డులను సాధించిన భారత స్పిన్నర్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2023
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ వేదికగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్లు జడేజా, రవిచంద్రన్ అశ్విన్ పలు రికార్డులను సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్ లో సీనియర్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా కూడా ఓ అరుదైన ఘనతను సాధించాడు. టీ బ్రేక్ సమయానికి అశ్విన్ మూడు కీలక వికెట్లను పడగొట్టాడు. దీంతో ఆసీస్‌పై వంద వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అదేవిధంగా ఆసీస్‌ బ్యాటర్ స్టీవ్‌ స్మిత్‌ను రెండుసార్లు డకౌట్‌ చేసిన ఏకైక బౌలర్‌ కూడా అశ్విన్‌ కావడం విశేషం. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌తో కలిపి 700 వికెట్లను పూర్తి చేసిన బౌలర్‌గా అవతరించాడు.

జడేజా

250 వికెట్లు తీసిన బౌలర్‌గా జడేజా

టెస్టుల్లో అశ్విన్‌ 460 వికెట్లతో కొనసాగుతున్నాడు. మరో రెండు వికెట్లు పడగొడితే ఆసీస్‌ బౌలర్‌ నాథన్ లైయన్‌ (461)ను అధిగమించి టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఎనిమిదో బౌలర్‌గా అవతరిస్తాడు. జడేజా, ఉస్మాన్ ఖవాజా వికెట్‌ను తీసి, టెస్టుల్లో 250 వికెట్లు తీసిన బౌలర్‌గా మారాడు. టెస్టు ఫార్మాట్‌లో 2500కిపైగా పరుగులు, 250 వికెట్లు తీసిన బౌలర్‌గా రవీంద్ర జడేజా నిలిచాడు. మరోవైపు వంద టెస్టుల క్లబ్‌లోకి ఛెతేశ్వర్‌ పుజారా చేరాడు. ఈ సందర్భంగా సునీల్‌ గావస్కర్ చేతులమీదుగా ప్రత్యేకమైన క్యాప్‌ను పుజారా అందుకున్నాడు