బౌలర్ల జాబితాలో రికార్డు సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్
అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచి టీమిండియా జట్టు చరిత్ర సృష్టించింది. ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు టెస్టుల్లోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 132 పరుగులు తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో భారత్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. మూడు ఫార్మాట్లలో ఒకేసారి నెం.1 స్థానాన్ని ఆక్రమించిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. 2014లో ఈ మైలురాయిని సాధించిన తొలి జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. ఈ సిరీస్‌లో ఇంకా మూడు టెస్టులు మిగిలి ఉండగానే, టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో టీమిండియా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో అశ్విన్
ప్రస్తుతం 846 పాయింట్లతో అశ్విన్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ (867) పాయింట్లతో ముందుస్థానంలో నిలిచాడు. టెస్టు ఆల్ రౌండర్ జాబితాలో జడేజా424 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. అశ్విన్ 358 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. నాగ్‌పూర్ టెస్టులో 120 పరుగులతో రాణించిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులో 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. గతంలో 10వ స్థానంలో ఉన్న రోహిత్ ఇప్పుడు 786 పాయింట్లతో 8వ స్థానంలో ఉన్నాడు. భారత ఆటగాళ్లలో రిషబ్ పంత్ బ్యాటింగ్ ర్యాకింగ్‌లో 7వ స్థానంలో నిలిచాడు.