
INDvsAUS : శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వేటు ఎవరిపై..?
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా యంగ్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీలో జరిగే రెండు టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. దీంతో టీమిండియా బలం మరింత పెరిగే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు వెన్నునొప్పితో జట్టుకు అయ్యర్ దూరమయ్యాడు. గతేడాది టెస్టులు, వన్డేల్లో టీమిండియా మిడిలార్డర్‌లో కీలకంగా వ్యవహరించాడు.
ప్రస్తుతం అయ్యర్ కోలుకున్నాడని, అతను ఆడేందుకు సిద్ధమయ్యాడని నేషనల్ క్రికెట్ అకాడమీ క్లియరెన్స్ ఇచ్చింది.
మొదటి టెస్టుకు అయ్యర్ దూరం కావడంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. అయితే మొదటి టెస్టులో సూర్యకుమార్ ఆకట్టుకోలేదు.
టీమిండియా
రెండు టెస్టుకు ఎంపికయ్యే జట్టు ఇదే..!
రెండు టెస్టులో అయ్యర్‌కి అవకాశం కల్పిస్తే సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్ లో ఒకరిని తప్పించే అవకాశం ఉంటుంది. ఒకవేళ భరత్‌ను తప్పిస్తే కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది.
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికె), ఆర్. అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా , మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్
నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 132 పరుగులతో తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.