విజృంభించిన స్పిన్నర్లు, మొదటి టెస్టులో టీమిండియా ఘన విజయం
తొలిటెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. స్పిన్ ఆడటంతో మరోసారి తమ బలహీనతను ఆస్ట్రేలియా బ్యాటర్లు బయటపెట్టుకున్నారు. దీంతో కంగారులు మూడో రోజుకే చాప చుట్టేశారు. భారత స్పిన్నర్లు విజృంభించడంతో ఆస్ట్రేలియా ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. జడేజా ఐదు వికెట్లు, అశ్విన్ మూడు వికెట్లు తీయడంతో టీమిండియా 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఆస్ట్రేలియా తరఫున, అరంగేట్రం ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ ఏడు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ 177 పరుగులకే ఆసీస్ ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన ఇండియా 400 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. భారత స్పిన్నర్ల ధాటికి 91 పరుగులకే ఆలౌటైంది.
అన్ని ఫార్మాట్లో సెంచరీ చేసిన ఆటగాడిగా రోహిత్‌శర్మ
2021లో చివరిసారిగా టెస్ట్ సెంచరీ చేసిన రోహిత్, నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి టెస్టులో సెంచరీతో మెరిశాడు. దీంతో టెస్టులో తొమ్మిది సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ టెస్టులో 3,257 పరుగుుల చేశాడు. అన్ని ఫార్మాట్లో సెంచరీ సాధించిన నాలుగో బ్యాటర్‌గా రోహిత్ శర్మి రికార్డుకెక్కాడు. పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజం, శ్రీలంకకు చెందిన దిల్షాన్, దక్షిణాఫ్రికాకు చెందిన ఫాఫ్ డు ప్లెసిస్ మాత్రమే ఈ జాజితాలో ఉన్నారు. 2022లో చివరిసారిగా టెస్టు మ్యాచ్ ఆడిన జడేజా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టులో విజృంభించాడు. మొదటి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి, 70 పరుగులు చేశాడు. దీంతో టెస్టులో 18 అర్ధ సెంచరీలను సాధించాడు.