Page Loader
రాణించిన అక్షర్, టీమిండియా 400 పరుగులకు ఆలౌట్
చివర్లో అద్భుతంగా రాణించిన అక్షర్, షమీ

రాణించిన అక్షర్, టీమిండియా 400 పరుగులకు ఆలౌట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 11, 2023
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 400 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే కుప్పకూలింది. మూడో రోజు ఆటలో 223 పరుగుల ఆధిక్యంలో భారత్ నిలిచింది. ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేసిన పిచ్‌పై భారత బ్యాటర్లు విజృంభించారు. రోహిత్ శర్మ 120 పరుగులు, ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్ (84), రవీంద్ర జడేజా (70) రాణించారు. అక్షర్, షమీ 79 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

టాడ్ మర్ఫీ

ఏడు వికెట్లు తీసిన టాడ్ మర్ఫీ

మూడో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే జడేజాను ఆసీస్ అరంగేట్రం స్పిన్నర్ టాడ్ మర్ఫీ పెవిలియన్‌కు పంపాడు. చివర్లో షమీ 47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ సెంచరీకి చేరువగా వచ్చి ఔట్ కావడంలో అభిమానులు నిరాశ చెందారు. ఆస్ట్రేలియా బౌలర్ టాడ్ మార్ఫీకి అత్యధికంగా 7 వికెట్లు తీశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను అవుట్ చేయడం ద్వార తొలి వికెట్ తీసిన మర్ఫీ.. అశ్విన్, పుజారా, కోహ్లీ, జడేజా, శ్రీకర్ భరత్, షమీని పెవిలియానికి పంపాడు. కెప్టెన్ కమిన్స్ కు రెండు, నాథన్ లియోన్‌కు ఒక వికెట్ దక్కింది.