టెస్టుల్లో అరంగేట్రం చేసిన టీ20 నెం1.ప్లేయర్
భారత్ టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ కల ఎట్టకేలకు నెరవేరింది. అంతర్జాతీయ టీ20, వన్డేలో అదరగొట్టిన సూర్య.. ప్రస్తుతం టీమిండియా తరుపున టెస్టుల్లో అరంగేట్రం చేశారు. ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లోని తొలి టెస్టులో సూర్యకుమార్ యాదవ్ చోటు దక్కించుకున్నారు. శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో అతనికి స్థానం లభించింది. టీ20, వన్డేల్లో రాణించిన సూర్యభాయ్.. టెస్టులో ఏ మేర రాణిస్తాడో చూడాలి టీ20ల్లో అదరగొడుతున్న సూర్యకుమార్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో చాలా బాగా రాణించాడు. మొత్తం 79 మ్యాచ్‌లలో 5,549 పరుగులను కలిగి ఉన్నాడు. ఇందులో 14 సెంచరీలు, 28 అర్ధ సెంచరీలున్నాయి.
టెస్టులో అరంగేట్రం చేసిన వికెట్ కీపర్ కేఎస్ భరత్
గతేడాది ఒకే క్యాలెండర్ లో 1000 పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. 48 టీ20 మ్యాచ్‌ల్లో 1675 పరుగులు చేశారు. ఇందులో 3 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్‌కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. SKYతో పాటు, వికెట్ కీపర్ KS భరత్ భారత్‌కు టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియా నుండి ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ తన తొలి టెస్ట్ క్యాప్ అందుకున్నాడు. 30 ఏళ్ల తర్వాత మూడు అంతర్జాతీయ ఫార్మాట్‌లలో అరంగేట్రం చేసిన మొదటి భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మార్చి 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన T20Iలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. వన్డేలో ఈఏడాది శ్రీలంకపై అరంగేట్రం చేశారు.