టీ20 నెం.1 ప్లేయర్‌కి టెస్టులోకి చోటు దక్కేనా..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో ఆస్ట్రేలియాను ఓడిస్తేనే భారత్ ఐసీసీ డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. ఈ సిరీస్‌లోని మొదటి టెస్టు నాగ్‌పూర్ లోని VCA స్టేడియంలో ప్రారంభం కానుంది.ఇండియా స్వదేశంలో 2017లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మొదటి టెస్టు ఆడే ప్లేయర్స్ ఎంపికలో టీమిండియా ఆచూతూచి వ్యవరిస్తోంది. శ్రేయాస్‌అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం ఐదో స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలో ప్రస్తుతం టీమిండియా యోచన చేస్తోంది. సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్‌గిల్‌తో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆస్కారం ఉంది. మొదటి టెస్టులో వీరద్దరి ఎంపిక ఆసక్తిగా మారింది. సూర్యకుమార్ ఇంకా టెస్టులో అరంగేట్రం చేయలేదు. గిల్ ఓపెనింగ్ స్థానంలో టెస్టులు ఆడిన అనుభవం ఉంది.
సూర్యకుమార్ యాదవ్ వర్సస్ శుభ్‌మన్ గిల్
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో గిల్ 40 మ్యాచ్‌ల్లో 52.87 సగటుతో 3,278 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, 16 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా 268 పరుగులు చేశాడు. టీమిండియా తరుపున టెస్టులో నాలుగు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ చేశాడు. టీ20 క్రికెట్‌లో భీకర ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్.. టెస్టులోనూ రాణించాలని కోరుకుంటున్నాడు. 2010లో FC క్రికెట్‌లోకి ఆడుగుపెట్టి 79 మ్యాచ్‌లను ఆడాడు. మొత్తం 5,549 పరుగులు చేయగా.. ఇందులో 14 సెంచరీలు, 28అర్ధ సెంచరీలున్నాయి. ఐదో నెంబర్ బ్యాటర్‌గా వీరిద్దరిలో ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదని, గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉండి సెంచరీలు చేస్తున్నాడని, మరోవైపు సూర్యకుమార్ టెస్టులో రాణించే అవకాశం ఉందని కెప్టెన్ రోహిత్‌శర్మ చెప్పారు.