ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల రేసులో గిల్, సిరాజ్
అన్ని ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను గుర్తించి.. గౌరవించడం కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి 2021లో 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డును ప్రవేశపెట్టిన విషం తెలిసిందే. 2023 జనవరికి సంబంధించి నామినీల వివరాలను ఐసీసీ తాజాగా ప్రకటించింది. జనవరిలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన శుభ్‌మన్‌గిల్, సిరాజ్, న్యూజిలాండ్‌కు చెందిన డెవాన్ కాన్వే, ఇంగ్లండ్ కు చెందిన గ్రేస్ స్క్రివెన్స్, ఆస్ట్రేలియాకి చెందిన బెత్‌మూనీ ఈసారీ పోటీలో ఉన్నారు. గిల్ హైదరాబాద్‌లో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ చేసి సత్తా చాటాడు. వన్డేలో వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20ల్లో 63 బంతుల్లో 126 పరుగులు చేసి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
వన్డేలో బౌలర్ల ర్యాకింగ్స్‌లో సిరాజ్ ఆగ్రస్థానం
గత నెలలో జరిగిన వన్డేల్లో సిరాజ్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. ఐదు మ్యాచ్‌లో 14 వికెట్లు తీశాడు. శ్రీలంకపై జరిగిన మూడో వన్డేలో 4/32 అకట్టుకున్నాడు. వన్డేలో బౌలర్ల ర్యాకింగ్ లో సిరాజ్ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన కాన్వే గతంలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టాడు. అనంతరం టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ అద్భుత సెంచరీతో అకట్టుకున్నాడు. అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్‌లో స్క్రీవెన్స్ మెరుగ్గా రాణించి, ఇంగ్లాండ్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లింది. ఈ సిరీస్ లో మొత్తం 293 పరుగులు చేసింది. ఇందులో తొమ్మిది అర్ధ సెంచరీలు ఉన్నారు. అదే విధంగా బౌలింగ్ విభాగంలో తొమ్మిది వికెట్లను తీసింది.