మహ్మద్ సిరాజ్ వరల్డ్ నంబర్ వన్ బౌలర్
ఈ వార్తాకథనం ఏంటి
మహ్మద్ సిరాజ్ వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా సంచలన రికార్డును సృష్టించాడు. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసిన అనంతరం ఐసీసీ వన్డే ర్యాకింగ్స్ ను విడుదల చేసింది. ఇందులో మహ్మద్ సిరాజ్ టాప్ స్థానంలో ఉన్నాడు. ఈ హైదరాబాద్ పేసర్ సంచలన బౌలింగ్‌తో ఈ మధ్య కాలంలో రికార్డును తిరిగరాస్తున్న విషయం తెలిసిందే.
న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకు అతనికి ఈ అవార్డు లభించింది. ఈ సిరీస్‌లో ఐదు వికెట్లు తీసి, ర్యాకింగ్స్‌లో తనకన్న ముందు స్థానంలో ఉన్న బౌల్ట్, జోష్ హేజిల్ వుడ్‌లను వెనక్కి నెట్టాడు.
మహ్మద్ సిరాజ్
సిరాజ్ సాధించిన రికార్డులివే
సిరాజ్ 729 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ తో సిరీస్ కు ముందు 685 పాయింట్లతో ఉన్న మూడో స్థానంలో ఉన్న సిరాజ్.. అద్భుత ప్రదర్శనతో ఆగ్రస్థానాన్ని అక్రమించాడు. సిరాజ్ 2019లో ఆస్ట్రేలియాపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు.
నాలుగు సంవత్సరాలలో 21 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అందులో 20.76 సగటుతో 38 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
మూడేళ్ల విరామం తర్వాత సిరాజ్ గతేడాది ఫిబ్రవరిలో భారత వన్డేలో చోటు దక్కించుకున్నాడు. వెస్టిండీస్ స్పిన్నర్ అకేల్ హోసేన్ 20 మ్యాచ్‌లలో 30 వికెట్ల తీయగా.. తర్వాతి స్థానంలో సిరాజ్ ఉన్నాడు.
శుభ్‌మాన్ గిల్ న్యూజిలాండ్‌తో పరుగుల వరద పారించడంతో 20 స్థానాలు ఎగబాకి వన్డే ర్యాకింగ్స్‌లో ఆరో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.