Page Loader
బ్రాస్‌వెల్ భయపెట్టినా, భారత్ థ్రిలింగ్ విక్టరీ
ఉత్కంఠ పోరులో భారత్ థ్రిలింగ్ విక్టరీ

బ్రాస్‌వెల్ భయపెట్టినా, భారత్ థ్రిలింగ్ విక్టరీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2023
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ చేయడంతో భారత్ 349 పరుగులు చేసింది. ఒకానొక దశలో భారత్ ఓడేలా కనిపించేలా శార్దుల్ ఠాకూర్ అద్భుతమైన యార్కర్‌తో భారత్‌కు విజయాన్ని అందించాడు. 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కివిస్, ఏడో వికెట్‌కు బ్రాస్‌వెల్, శాంటర్న్ అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బ్రాస్‌వెల్ 78 బంతుల్లో 140 పరుగులు చేసి భారత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. టీమిండియా బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు తీసి, టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. రోహిత్ శర్మ, గిల్‌తో‌ 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. విరాట్‌కోహ్లీ, ఇషాన్ నిరాశపరిచినా.. గిల్ చివరి వరకు నిలిచి డబుల్‌సెంచరీ సాధించాడు

టీమిండియా

మొదటి వన్డేలో నమోదైన రికార్డులివే..

భారత్‌లో అత్యధిక వన్డే సిక్స్‌లు బాదిన ధోని రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఐదో భారత బ్యాట్స్‌మెన్‌గా గిల్ నిలిచాడు. రోహిత్, టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇషాన్ కిషన్‌ తర్వాతి స్థానంలో గిల్ ఉన్నాడు. ముఖ్యంగా వన్డేల్లో అత్యధిక స్కోరు (264) రోహిత్ శర్మ పేరు మీద ఉంది. రోహిత్ ఏకంగా మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. గిల్ వన్డేల్లో అరుదైన ఘనతను సాధించాడు. వన్డేల్లో 19 మ్యాచ్‌లు ఆడి 1000 పరుగులు చేసిన భారత్ ఆటగాడిగా చరిత్ర నెలకొల్పాడు బ్రేస్‌వెల్ వన్డే క్రికెట్‌లో న్యూజిలాండ్ తరఫున మూడో ఫాస్టెస్ట్ సెంచరీని కొట్టాడు. 57 బంతుల్లో ఈ సెంచరీ చేసి సత్తా చాటాడు.