Page Loader
రికార్డుల మోత మోగించిన శుభ్‌మన్ గిల్
వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన శుభ్‌మాన్ గిల్

రికార్డుల మోత మోగించిన శుభ్‌మన్ గిల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2023
02:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో జరిగిన వన్డేలో శుభ్‌మన్ గిల్ రికార్డుల మోత మోగించాడు. వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన ఐదో బ్యాటర్‌గా రికార్డును సృష్టించాడు. 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్లతో 208 పరుగులు చేసి అరుదైన ఘనతను కైవసం చేసుకున్నాడు. గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ (34) తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించారు. ఒకపక్క టీమిండియా వికెట్లు కోల్పోతున్నా.. మరోపక్క గిల్ పరుగుల వరద పారించాడు. రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇషాన్ కిషన్‌ తర్వాత డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అదే విధంగా వన్డేల్లో అత్యంత వేగంగా 1,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా గిల్ సత్తా చాటాడు.

శుభ్‌మన్ గిల్

గిల్ సాధించిన రికార్డులివే

గిల్ అత్యంత పిన్న వయసులో (23 ఏళ్ల 132 రోజులు) డబుల్‌ సెంచరీ సాధించిన మొదటి ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇషాన్‌ కిషన్‌ (24 ఏళ్ల 145 రోజులు) పేరిట ఉండేది. గిల్ కేవలం 19 వన్డే ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు సాధించాడు. భారత ఆటగాళ్లలో ధావన్ మాత్రమే (17) ఫార్మాట్‌లో మూడు సెంచరీలు పూర్తి చేశాడు. వన్డేల్లో న్యూజిలాండ్‌పై డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో సచిన్ టెండుల్కర్ 186 పరుగులు చేసి నాటౌట్‌ నిలిచాడు. డబుల్‌ సెంచరీతో పాటు హ్యాట్రిక్‌ సిక్సర్లతో డబుల్‌ సెంచరీ పూర్తి చేసి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు.