Page Loader
భయపడేది లేదు, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై టీమిండియా కాన్ఫిడెన్స్
WTC ఫైనల్ బెర్త్‌ను పొందాలంటే భారత్‌కి కనీసం 2-0తో గెలుపొందాలి

భయపడేది లేదు, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై టీమిండియా కాన్ఫిడెన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 08, 2023
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ క్రికెట్లో రెండు అత్యుత్తమ జట్లు టెస్టులో తలపడితే అభిమానులకు అంతకుమంచి కిక్ ఏముంటుంది. ఉత్కంఠభరిత సమరాలకు వేదికగా నిలిచే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రేపటి నుంచి ప్రారంభం కానుంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మొదటి టెస్టు జరగనుంది. ఈ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండనుంది. ఇందులో ఆరు టెస్టు మ్యాచ్‌లు జరగ్గా.. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు మూడుసార్లు గెలిచాయి. అయితే ఇక్కడ టీమిండియా ఆడిన ఆరు టెస్టులో నాలుగింటిని గెలిచింది. మ్యాచ్ స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఉదయం 9:30కి ప్రసారం కానుంది. టీమిండియాకు పంత్, అయ్యర్, బుమ్రా దూరం కాగా.. ఆస్ట్రేలియాకు హేజిల్‌వుడ్, స్టార్క్ నాగ్‌పూర్ టెస్టు నుంచి వైదొలిగారు. కామెరాన్ గ్రీన్ ఆడడం కూడా సందేహంగా ఉంది.

టీమిండియా

ఇరు జట్లలోని సభ్యులు

భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటివరకూ 102 టెస్టులో తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా 43 మ్యాచ్ లు గెలవగా.. టీమిండియా 30 మ్యాచ్ లను మాత్రమే గెలిచింది. ఇందులో 28 మ్యాచ్ లు డ్రా అయ్యాయి. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన 50 టెస్టుల్లో భారత్ 21 విజయాలను సాధించింది. భారత్ : రోహిత్‌శర్మ (కెప్టెన్), కేఎల్‌రాహుల్, పుజారా, కోహ్లీ, శుభ్‌మన్ గిల్/ సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), జడేజా, అశ్విన్, సిరాజ్, షమీ, కుల్దీప్ యాదవ్ ఆస్ట్రేలియా : ఉస్మాన్ ఖవాజా, వార్నర్, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్‌స్మిత్, అలెక్స్‌కారీ (వికెట్ కీపర్), ట్రావిస్ హెడ్, మాట్ రెన్షా, అష్టన్ అగర్, లియోన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్