ఐపీఎల్ టైటిల్ పై గురిపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ 16వ ఎడిషన్ ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారీ ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడాలని చూస్తోంది. రోడ్డ ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ఈ సీజన్‌కు దూరమవడంతో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స, లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఇండియన్ పేసర్ ముఖేష్ కుమార్ ని రూ. 5.5 కోట్లకు 2023 వేలంలో కొనుగోలు చేసింది. బ్యాటింగ్‌లో బలంగా ఉండేందుకు ఫిల్ సాల్ట్ రూ.2 కోట్లు, మనీష్ పాండే రూ. 2.4 కోట్లు, రిలీ రోసౌ రూ.4.6 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని సభ్యులు
ఢిల్లీ మొదటి ఐదు సీజన్లలో మూడుసార్లు నాలుగో స్థానంలో నిలిచింది. 2020లో తొలిసారిగా ఫైనల్‌కు చేరుకున్నా.. ముంబైలో చేతిలో పరాజయం పాలైంది. పంత్ లేకపోవడంతో వికెట్ కీపర్ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. సర్ఫరాజ్ ఖాన్ హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్‌సాల్ట్ కీపింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో రోవ్‌మన్ పావెల్, రిలీ రోసౌవ్‌లు బెంచ్‌కు పరిమితం కానున్నారు జట్టు: వార్నర్ (కెప్టెన్), పృథ్వీషా, రిపాల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్‌ఖాన్, యశ్‌ధుల్, మిచెల్‌మార్ష్, లలిత్‌యాదవ్, అక్షర్‌పటేల్, అన్రిచ్ నార్ట్జే, సకారియా, నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, లుంగీ ఎన్‌గిడి, ముస్తాఫిజుర్, అమన్‌ఖాన్, కుల్దీప్‌యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ఫిల్ సాల్ట్, ఇషాంత్‌శర్మ, ముఖేష్‌కుమార్, మనీష్ పాండే, రిలీరోసౌ