ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ రేసులో ఉన్నదెవరు..?
మార్చి 31 నుంచి ఐపీఎల్ లీగ్ ప్రారంభం కానుంది. 2023 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచేజీ నూతన కెప్టెన్‌ను ఎంపిక చేసింది. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ గతేడాది చివర్లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో 2023 ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. పంత్ గైర్హాజరుతో డీసీ సారథ్య బాధ్యతలను డేవిడ్ వార్నర్ కు అప్పగించాలని మేనేజ్ మెంట్ తో పాటు కోచ్ రికీ పాటింగ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా వార్నర్‌తో పాటు కెప్టెన్సీ రేసులో అక్షరపటేల్ పేరు ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వార్నర్‌కు అనుభవం ఉందని, కావున సారథ్య బాధ్యతల్ని అతనికే అప్పగించాలని కోచ్ రికీ పాటింగ్ చెబుతున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వార్నర్
కెప్టెన్సీ రేసులో ఇంకా రోవమన్ పావెల్, మనీశ్ పాండే, మిచెల్ మార్ష్ ల పేర్లు వినిపించినప్పటికీ యాజమాన్యం అనుభవజ్ఞుడైన డేవిడ్ వార్నర్ కు అప్పగించాలని భావిస్తోంది. వార్నర్ గతంలో సన్ రైజర్స్ కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును ముందుడి నడిపించాడు. ఢిల్లీ టీమ్ కు వార్నర్ కెప్టెన్ గా వ్యవహరించడం కొత్తేమీ కాదు. వార్నర్ ఐపీఎల్ కెరీర్ ఢిల్లీ టీమ్ తోనే మొదలైంది. 2009 నుంచి 2013 వరకు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్స్‌లో ఒకరిగా వార్నర్ నిలిచాడు.