Page Loader
WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మెగ్ ల్యానింగ్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా నియామకమైన మెగ్ ల్యానింగ్

WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మెగ్ ల్యానింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2023
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాకు ఒంటి చేత్తో విజయాలను అందిస్తున్న మెగ్ ల్యానింగ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్సీగా ఎంపికైంది. యువ క్రికెటర్ జెమీయా రోడ్రిగ్స్‌ను వైస్ కెప్టెన్సీగా నియామకమైంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో మెగ్ లానింగ్‌కు తిరుగులేదు. అమె సారథ్యంలోనే ఆస్ట్రేలియా నాలుగు టీ20 ప్రపంచ కప్‌లు గెలిచింది. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన ICC మహిళల T20 ప్రపంచ కప్ టైటిల్‌ను ఆస్ట్రేలియాకు అమెకు అందించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 132 టీ20లు ఆడిన లానింగ్‌ 36.61 సగటు, 116.7 స్ట్రైక్‌రేట్‌తో 3405 పరుగులు చేసింది. 15 హాఫ్‌ సెంచరీలు బాదేసింది. అదే విధంగా ఆస్ట్రేలియాకు 100 టీ20ల్లో సారథ్యం వహించింది.

ఢిల్లీ క్యాపిటల్

ఢిల్లీ క్యాపిటల్ జట్టులోని సభ్యులు

2018లో అరంగేట్రం రోడ్రిగ్స్ 80 మ్యాచ్‌ల నుండి 29.98 సగటుతో 1,704 పరుగులు చేశాడు. మహిళల ప్రీమియర్‌ లీగులో ఐదింట్లో మూడు జట్లను ఆసీస్‌ క్రికెటర్లే నడిపిస్తుండటం గమనార్హం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: మెగ్ లానింగ్ (కెప్టెన్), అలిస్ క్యాప్సే, శిఖా పాండే, జెస్ జోనాస్సేన్, లారా హరిస్, రాధా యాదవ్, మిన్ను మణి, తానియా భాటియా, పూనమ్ యాదవ్, స్నేహ దీప్తి, అరుంధతి రెడ్డి, టిటాస్ సాధు, జసియా అఖ్తర్, ఎ తారానా అఖ్తర్ మోండల్, జెమిమా రోడ్రిగ్స్ (వైస్-కెప్టెన్), షఫాలీ వర్మ, మారిజానే కాప్.