LOADING...
Delhi Capitals : దిల్లీ క్యాపిట‌ల్స్‌ హెడ్‌ కోచ్‌ హేమాంగ్ బదానికు మరో కీలక పదవి
దిల్లీ క్యాపిట‌ల్స్‌ హెడ్‌ కోచ్‌ హేమాంగ్ బదానికు మరో కీలక పదవి

Delhi Capitals : దిల్లీ క్యాపిట‌ల్స్‌ హెడ్‌ కోచ్‌ హేమాంగ్ బదానికు మరో కీలక పదవి

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 11, 2026
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

డిల్లీ క్యాపిట‌ల్స్‌ హెడ్‌ కోచ్‌గా ఉన్న హేమాంగ్ బదానికు మరో కీలక బాధ్యత దక్కింది. ది హండ్రెడ్ టోర్నీలోని సదరన్ బ్రేవ్ పురుషుల జట్టుకు కూడా అతడిని హెడ్‌ కోచ్‌గా నియమించారు. ఈ రెండు ఫ్రాంచైజీల్లోనూ జీఎంఆర్ గ్రూప్ సహ యజమానిగా ఉండటం గమనార్హం. సదరన్‌ బ్రేవ్‌ యాజమాన్యం బదానీకి డిప్యూటీగా, అంటే అసిస్టెంట్‌ కోచ్‌గా ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు ఇయాన్ బెల్ ను ఎంపిక చేసింది. జీఎంఆర్‌ గ్రూప్‌కు ఐపీఎల్‌, హండ్రెడ్‌ లీగ్‌లతో పాటు ఇతర అంతర్జాతీయ టోర్నీల్లో కూడా ఫ్రాంచైజీలు ఉన్నాయి . వాటిలో మేజర్ లీగ్ క్రికెట్లోని సీటెల్ ఓర్కాస్, అలాగే ఇంటర్నేషనల్ లీగ్ T20లోని దుబాయ్ క్యాపిట‌ల్స్‌ జట్లు కూడా ఉన్నాయి.

Details

సదరన్‌ బ్రేవ్ గత ప్రదర్శనలు

సదరన్‌ బ్రేవ్‌ జట్టు హండ్రెడ్‌ లీగ్ తొలి ఎడిషన్‌లోనే విజేతగా నిలిచింది. ఆ తరువాత 2024 సీజన్‌లో రన్నరప్‌గా ముగించింది. అయితే గత ఎడిషన్‌లో మాత్రం జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. సగం మ్యాచ్‌లు ఓడిపోవడంతో నాకౌట్ దశకు కూడా చేరుకోలేకపోయింది. 2026 సీజన్ షెడ్యూల్ హండ్రెడ్‌ లీగ్‌ 2026 సీజన్ జులై 21 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఎంఐ లండ‌న్‌, స‌న్ రైజ‌ర్స్ లీడ్స్ జట్లు తలపడనున్నాయి. ఇక జులై 22న జరిగే మ్యాచ్‌లో సదరన్‌ బ్రేవ్‌, వెల్ష్ ఫైర్ తో పోటీ పడనుంది.

Details

తొలిసారి వేలం విధానం

హండ్రెడ్‌ లీగ్ చరిత్రలో తొలిసారిగా ఈసారి ఆటగాళ్లను వేలం ద్వారా ఎంపిక చేయనున్నారు. మార్చి 11, 12 తేదీల్లో జరిగే ఈ వేలానికి 18 దేశాలకు చెందిన సుమారు 400 మంది ఆటగాళ్లు షార్ట్‌లిస్ట్ అయ్యారు. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు ఈ వేలంలో పాల్గొననున్నాయి.

Advertisement