Page Loader
వుషు ఆటగాళ్లకు వీసాలు నిరాకరణ.. చైనా తీరుపై మండిపడ్డ భారత ఒలింపిక్ సంఘం
వుషు ఆటగాళ్లకు వీసాలు నిరాకరణ.. చైనా తీరుపై మండిపడ్డ భారత ఒలింపిక్ సంఘం వుషు ఆటగాళ్లకు వీసాలు నిరాకరణ.. చైనా తీరుపై మండిపడ్డ భారత ఒలింపిక్ సంఘం

వుషు ఆటగాళ్లకు వీసాలు నిరాకరణ.. చైనా తీరుపై మండిపడ్డ భారత ఒలింపిక్ సంఘం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 26, 2023
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలోని హాంగ్‌జౌలో జరుగనున్న 19వ ఆసియా క్రీడల్లో అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు చైనా అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ చర్యపై భారత ఒలింప్ సంఘం (IOA) చైనాపై గట్టి చర్యలు తీసుకోనుంది. ఈ విషయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కళ్యాణ్ చౌబే పేర్కొన్నారు. భారత ఆటగాళ్లకు వీసా నిరాకరించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ భారత ఒలింపిక్స్ సంఘం (ఐఓఏ), ఆసియా ఒలింపిక్ కౌన్సిల్‌కు అధికారిక లేఖ రాసింది. భారతీయ వుషు ఆటగాళ్లకు వీసాలు నిరాకరించడంపై జాతీయ సంస్థ గట్టి చర్యలను తీసుకుంటుందని, రెండు దేశాలకు సంబంధించిన సున్నితమైన సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కళ్యాణ్ చౌబే చెప్పారు.

Details

చైనా పర్యటనను రద్దు చేసుకున్న అనురాగ్ ఠాకూర్

అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వుషు ఆటగాళ్లు ఈ నెల 20న చైనాకు బయలు దేరారు. అయితే వారి బోర్డింగ్‌కు సరైన క్లియరెన్స్ లేనందున వారిని విమానం ఎక్కనీయలేదు. దీంతో ఆ ఆటగాళ్లను న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్‌కు తిరిగి తీసుకొచ్చారు. నైమాన్ వాంగ్సు, ఒనిలు తేగా, మెపుంగ్ లాంగులకు చైనాలో ప్రవేశం నిరాకరించడంతో ఆ దేశ పర్యటనను కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.