Suchika Tariyal: అద్భుతంగా పోరాడినా ఫైనల్ చేరలేకపోయిన సుచిక.. కారణం ఏమిటంటే?
ఈ వార్తాకథనం ఏంటి
తొలిసారి ఆసియా క్రీడల్లో ప్రవేశపెట్టిన మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) విభాగంలో భారత అథ్లెట్ సుచిక తరియల్ (Suchika Tariyal) కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. అయితే సెమీఫైనల్లో ఆమె అద్భుతంగా పోరాడినప్పటికీ ఓటమి తప్పలేదు. ముఖ్యంగా మ్యాచ్ ఫలితాన్ని తేల్చేందుకు అమలు చేసిన 'బరువు' నిబంధన కారణంగా సుచిక ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. మహిళల 60 కేజీల విభాగం సెమీఫైనల్లో సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియో (Hui Hoon Teo)తో సుచిక తలపడింది. విజయం కోసం ఇద్దరు అథ్లెట్లు చివరి వరకు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ తీవ్రంగా పోరాడారు.
వివరాలు
అదే వ్యత్యాసం..
నిర్దిష్ట సమయం ముగిసే వరకు సుచిక, టియో స్కోర్లు సమంగా నిలిచాయి. అయితే టియో ఆధిపత్యం ప్రదర్శించిందని ముగ్గురు రిఫరీలు భావించారు.
దీంతో ఆమెను విజేతగా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఈ నిర్ణయంపై భారత బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది.
మొత్తం 10 మంది అధికారులు మ్యాచ్‌ను సమీక్షించారు. రివ్యూ అనంతరం మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు ప్రకటించారు.
అయితే ఈ ఫలితం కూడా సుచికకు అనుకూలంగా మారలేదు. మ్యాచ్ టై కావడంతో ఆసియా MMA నిబంధనల ప్రకారం 'బరువు'ను ప్రామాణికంగా తీసుకుని సింగపూర్ అథ్లెట్ టియోను విజేతగా ప్రకటించారు.
వివరాలు
700 గ్రాముల తక్కువ బరువు
పోటీలకు ముందు ఉదయం ప్రతి అథ్లెట్ బరువును అధికారులు తనిఖీ చేస్తారు. ఆ సమయంలో సుచిక కంటే టియో 700 గ్రాములు తక్కువ బరువు ఉన్నట్లు తేలింది.
దీంతో టియో ఫైనల్‌కు చేరుకుంది. సుచిక సెమీఫైనల్లోనే ఓటమి చెందడంతో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
సుచిక ఫైనల్‌కు చేరి ఉంటే కనీసం రజత పతకం దక్కించుకునే అవకాశం ఉండేది. అయితే 'బరువు' నిబంధన కారణంగా ఆమెకు ఆ అవకాశం దక్కలేదు.
వివరాలు
రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
మ్యాచ్ పూర్తయ్యాక, అదనపు సమయంలోనూ ఫలితం తేలకుండా డ్రా లేదా టైగా ముగిసిన సందర్భాల్లో విజేతను నిర్ణయించేందుకు కొన్ని ప్రమాణాలను వరుసగా పరిశీలిస్తారు.
మొదటగా అథ్లెట్లలో ఎవరైనా వార్నింగ్‌లు అందుకున్నారా? అనే అంశాన్ని పరిశీలిస్తారు. ఒక అథ్లెట్‌కు వార్నింగ్ వచ్చి, మరో అథ్లెట్‌కు రాకపోతే వార్నింగ్ లేని అథ్లెట్‌ను విజేతగా ప్రకటిస్తారు.
ఒకవేళ ఇద్దరు అథ్లెట్లకు వార్నింగ్‌లు సమానంగా ఉంటే.. తదుపరి 'అడ్వైస్'లను లెక్కలోకి తీసుకుంటారు.
వార్నింగ్‌లు, అడ్వైస్‌లు కూడా సమంగా ఉంటే లేదా ఎవరికీ అవి రాకపోతే.. కీలకమైన 'బరువు'ను పరిగణనలోకి తీసుకుంటారు.
పోటీల రోజు ఉదయం అథ్లెట్ల బరువును నమోదు చేస్తారు. ఇద్దరి మధ్య ఫలితం తేలకపోతే తక్కువ బరువు ఉన్న అథ్లెట్‌ను విజేతగా ప్రకటిస్తారు.
వివరాలు
రూల్స్ ఏం చెబుతున్నాయంటే?1/2
ఒకవేళ పోటీ రోజు ఉదయం ఇద్దరి బరువూ సమంగా ఉంటే.. మ్యాచ్ ముగిసిన తర్వాత అథ్లెట్ల బరువును పోలుస్తారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇద్దరి బరువులు ఒకేలా ఉంటే.. ముగ్గురు సైడ్ రిఫరీలు ఫ్లాగ్ నిర్ణయం ద్వారా విజేతను తేలుస్తారు. ఈ నిర్ణయం ఆయా రిఫరీల విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
సుచిక విషయంలో ఉదయం బరువును పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆమె ప్రత్యర్థి టియో కంటే కాస్త ఎక్కువగా ఉంది. దీంతో బరువు నిబంధన ప్రకారం టియో విజేతగా నిలిచి ఫైనల్‌కు చేరుకుంది. సుచిక మాత్రం సెమీఫైనల్లోనే ఓటమి చెందడంతో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.